Jewellery in Bank Locker : లాకర్‌లో బంగారం దాచారా? ఇన్సూరెన్స్ చేయించారా? పోతే బ్యాంకులు బాధ్యత వహించవు!

బ్యాంకు లాకర్‌లో బంగారం దాచారా? ఇంతకీ మీ బంగారం భద్రమేనా? వెంటనే ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఒకవేళ మీ బంగారం పోతే.. బ్యాంకు ఎటువంటి బాధ్యత వహించదు.

Jewellery in Bank Locker : లాకర్‌లో బంగారం దాచారా? ఇన్సూరెన్స్ చేయించారా? పోతే బ్యాంకులు బాధ్యత వహించవు!

Have Jewellery In Locker Buy Insurance As Bank Is Not Liable For Any Loss

Jewellery in Bank Locker : బ్యాంకు లాకర్‌లో బంగారం దాచారా? ఇంతకీ మీ బంగారం భద్రమేనా? వెంటనే ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఒకవేళ మీ బంగారం పోతే.. బ్యాంకు ఎటువంటి బాధ్యత వహించదు. ప్రస్తుత రోజుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్లు, బంగారు అభరణాలు వంటి విలువైన వస్తువులు ఇంట్లో కంటే బ్యాంకు లాకర్లలో భద్రత ఉంటుందని భావిస్తుంటారు. అయితే బ్యాంకు లాకర్లలో వీటిని దాయాలంటే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు రూ.1,000 నుంచి రూ.10,000 వరకు చార్జ్ చేస్తుంటాయి. ఒకవేళ మీరు బంగారం దాచిన బ్యాంకులో ఫిక్స్ డ్ డిఫాజిట్ చేస్తే.. అప్పుడు లాకర్ చార్జీలను బ్యాంకులు మాఫీ చేస్తున్నాయి. ఇంట్లో కంటే బ్యాంకుల్లోనే బంగారం భద్రంగా ఉంటుందని చాలామంది లాకర్లలో దాచుకుంటుంటారు. ఎందుకంటే.. అక్కడ భద్రతాపరమైన స్ట్రాంగ్ రూం వంటి వసతులు ఉంటాయి. సీసీటీవీ మానిటరింగ్ నిఘా ఎప్పుడూ ఉంటుంది. ప్రతి మూవెంట్ రికార్డు అవుతుంది. సెక్యూరిటీ గార్డులు, నిఘాలో ఉంటుంది. ఒకసారి మీ బంగారాన్ని బ్యాంకు లాకర్ లో దాచుకుంటే.. ఎలాంటి భయం లేకుండా హాయిగా ఇంట్లో నిద్రపోవచ్చు.

లాకర్‌లో వస్తువులపై రిస్క్ మీదే :
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, బ్యాంకు లాకర్లలో దాచిన బంగారం ఏదైనా అనుకోని అగ్నిప్రమాదం, దోపిడీ, సిబ్బంది నిర్లక్ష్యం, ప్రకృతి విపత్తులు వంటి ఇతర అనుమానాస్పద సంఘటనలు జరిగితే మాత్రం విలువైన బంగారం, డాక్యుమెంట్లు కోల్పోయినట్టే.. అప్పుడు మీరు దాచుకున్న బంగారానికి బ్యాంకులు బాధ్యత వహించవు. ఈ విషయంలో భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) 2017లో మార్గదర్శకాలు విడుదల చేసింది. లాకర్లలో కోల్పోయిన విలువైన వస్తువుల పట్ల బ్యాంకులకు ఎలాంటి బాధ్యత లేదని పేర్కొంది. అలాగే ఎలాంటి నష్టపరిహారాన్ని కూడా బాధితులకు అందించవు. బ్యాంకు లాకర్ తీసుకునే సమయంలోనే లాకర్ అగ్రిమెంట్ తీసుకోవడం జరుగుతుంది. అందులో బ్యాంకులకు సంబంధం ఉండదని విషయం స్పష్టంగా ఉంటుంది. లాకర్లలో దాచే విలువైన వస్తువుల విషయంలో కస్టమర్లు సొంత రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్యాంకుకు వెళ్లి అడిగితే.. ఒకటే ప్రశ్న.. లాకర్ మాత్రమే మీకిచ్చాం.. అందులో మీరేం దాచారో మాకు చెప్పారా? అని అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది తమ విలువైన వస్తువుల విషయంలో ప్రైవసీ చూసుకుంటారు. అందుకే బ్యాంకులు కూడా వాటి విషయంలో కస్టమర్ల ఇష్టానికే వదిలేస్తాయి. ఒకవేళ బ్యాంకులు లాకర్లలో ఏమేమి దాస్తున్నారో డాక్యుమెంట్ల రూపంలో చూపించమని అడిగితే.. అక్కడ ప్రైవసీకి భంగం కలిగినట్టు అవుతుంది. చాలామంది కస్టమర్లు ఇన్ కమ్ ట్యాక్స్ వంటి ఇతర విషయాల్లో భయపడి లాకర్లలో దాచే విలువైన వాటిని బహిర్గతం చేసేందుకు వెనకాడుతుంటారు.

కస్టమర్ల ముందు మార్గం ఒకటే..
బీమా పాలసీ తీసుకోవడం.. తద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు. బ్యాంకులు తమ కస్టమర్లకు ఎటువంటి లాకర్ బీమాను అందించవు. కొంతమంది ప్రైవేట్ ఏజెన్సీలు ఇలాంటి బీమా పాలసీలతో కస్టమర్లకు సాయపడగలరు. ఈ బీమా పాలసీలను తీసుకోవడం ద్వారా బ్యాంక్ లాకర్‌లో నగదు, ఇతర విలువైన వస్తువుల నష్టాల నుంచి కస్టమర్లను రక్షించుకోవచ్చు. ఈ విధానాలలో బ్యాంక్ లాకర్‌లో ముఖ్యమైన పత్రాలను భీమా చేయడానికి యాడ్-ఆన్ కవర్లు ఉన్నాయి. ఈ పాలసీలో ప్రమాదాలు, దోపిడీలు, హోల్డప్‌లు, బ్యాంక్ సిబ్బందిపై అవిశ్వాసం, ఉగ్రవాద చర్యలతో బ్యాంక్ లాకర్ నుంచి విలువైనవి కోల్పోవడం లేదా దెబ్బతినడం వర్తిస్తాయి. అదనపు ప్రీమియం ద్వారా ఇవన్నీ కవర్ చేయవచ్చు. గోల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ రూ .2 లక్షల నుంచి రూ. 50 లక్షలు అంతకంటే ఎక్కువ బీమా మొత్తాన్ని అందిస్తుంది.

భీమా కవర్ల ప్రీమియం ఛార్జీలు మీరు లాకర్ లోపల ఉంచాలనుకునే బంగారం మొత్తం మీద ఆధారపడి ఉంటుంది.  ప్రీమియం ఛార్జీలు కూడా నామమాత్రమే. రూ .10 లక్షల విలువైన వస్తువుల బీమా మొత్తానికి, ముంబై వంటి నగరంలో ప్రీమియం సుమారు రూ.1,000 ఉంటుంది. జీఎస్టీ ఉండొచ్చు. బ్యాంకులు, అందులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా, ఒక కస్టమర్ లాకర్ లోపల విలువైన వస్తువులను కోల్పోతే.. అప్పుడు పరిహారం చెల్లించడం బ్యాంకు విధి. పరిహారం చెల్లించడానికి బ్యాంక్ నిరాకరిస్తే.. కస్టమర్ జాతీయ వినియోగదారుల పరిష్కార కమిషన్‌ను సంప్రదించవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో.. లాకర్ సదుపాయాల నిర్వహణకు సంబంధించి బ్యాంకులు తీసుకోవలసిన చర్యలను తప్పనిసరి చేస్తూ ఆరు నెలల్లోగా నిబంధనలు తీసుకురావాలని రిజర్వ్ బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది.

లాకర్లను నిర్వహించే కస్టమర్ల పట్ల బ్యాంకులు బాధ్యత లేదని తప్పుకోవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశానికి వ్యతిరేకంగా కోల్‌కతా స్థానికుడు అమితాభా దాస్‌గుప్తా దాఖలు చేసిన అప్పీల్‌పై కోర్టు ఈ పరిశీలన చేసింది. దీన్ని ఖరారు చేయడానికి ఆర్‌బిఐకి మరో నెల లేదా అంతకంటే ఎక్కువ సమయాన్ని ఇచ్చింది. ఏదేమైనా, బ్యాంకుల నిర్లక్ష్యం విషయంలో మాత్రమే కోర్టు సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. మిగతా విషయల్లో మాత్రం సాధ్యం కాదని గుర్తించుకోవాలి. మీ బంగారాన్ని ఉంచడానికి బ్యాంకులు సురక్షితమే.. కానీ విలువైన వస్తువులను లాకర్లలో ఉంచడం వల్ల కలిగే నష్టాలపై కూడా అవగాహన ఉండాలంటున్నారు విశ్లేషకులు.