ELECTIONS IN 2024
ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. పలు దేశాల రాజకీయ నాయకులకు 2024 ఎంతో కీలకం. భారత్, అమెరికా, రష్యా వంటి దేశాల్లో 2024లో ఎన్నికలు జరగనున్నాయి. భారత్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
భారత్‌లో..
భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్-మే 2024లో జరగనున్నాయి. ఎన్డీఏ గెలిస్తే ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏప్రిల్-మేలోనే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. అక్టోబరులో హరియాణా, మహారాష్ట్రలో ఎన్నికలు జరగాల్సి ఉంది. నవంబరు/డిసెంబరులో ఝార్ఖండ్‌లో ఎన్నికలు జరుగుతాయి.
పాకిస్థాన్‌లో..
పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తేదీ వాయిదా పడుతుందని వచ్చిన ప్రచారాన్ని ఇప్పటికే పాక్ ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. గోహర్ అలీ ఖాన్ నేతృత్వంలో పీటీఐ, నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ఎన్, బిలావర్ భుట్టో జర్దారీకి చెందిన పీపీపీ ప్రధాన పార్టీలు.
అమెరికాలో..
ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే అమెరికా ఎన్నికలు కూడా 2024లోనే జరగనున్నాయి. రిపబ్లికన్స్, డెమొక్రాట్స్ పార్టీలు పోటీ పడనున్నాయి. డెమొక్రాట్ల తరఫున జో బైడెన్, రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయి.
రష్యాలో..
రష్యా అధ్యక్ష ఎన్నికలు 2024 మార్చి 17న జరగనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (71) ఐదోసారి కూడా మళ్లీ ఆ పదవిలోనే కొనసాగడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Vamsi Krishna Srinivas : వైసీపీకి వంశీ రాజీనామా? జనసేన వైపు ఎమ్మెల్సీ చూపు..!