Customs Seizes 21 Lakh Pieces Of Peacock Tail Feathers
customs seizes 21 lakh pieces of peacock tail feathers : నెమలి మన జాతీయ పక్షి. అటువంటి నెమలికి హాని కలిగిస్తే..నేరం. కానీ నెమళ్లకు హాని జరుగుతూనే ఉంది. అక్రమ తరలింపులు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో కొంతమంది అక్రమార్కులు 21 లక్షల నెమలి తోక ఈకలను తరలిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
సదరు అక్రమార్కుల వద్ద 21 లక్షల నెమలి ఈకలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకలను సీజ్ చేశారు. అనంతరం వారికి అదుపులోకి తీసుకున్నారు. ఆ నెమలి ఈకలను అక్రమ రీతిలో చైనాకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఐసీడీ తుగ్లకాబాద్ వద్ద వాటిని పట్టుకున్నారు.
సుమారు 2566 కిలోల బరువు ఉన్న కన్‌సైన్మెంట్‌ను అధికారులు సీజ్ చేశారు. పీవీసీ పైపులను తీసుకువెళ్తున్నామంటూ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వైద్యం కోసం చైనీయులు నెమల తోక ఈకలను వాడుతారని ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు.