22 dead amd 5 missing after floods and landslides in Himachal pradesh
హిమాచల్ ప్రదేశ్లో పోటెత్తిన భారీ వరదల కారణంగా 22 మంది మృతి చెందగా ఐదుగురు మిస్సైనట్లు స్థానిక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గడిచిన 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇదని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ సుదేశ్ కుమార్ మోఖ్తా తెలిపారు. వర్షాల ధాటికి రాష్ట్రంలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, కొండచరియలు విరిగి పడుతున్నాయని.. వీటి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన శనివారం పేర్కొన్నారు.
మండి, కంగ్ర, చంబ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు వాతావరణ మార్పుల కారణంగా 36 ప్రమాదాలు సంభవించినట్లు సుదేశ్ కుమార్ మోఖ్తా అన్నారు. మనాలి-ఛండీగఢ్ జాతీయ రహదారి సహా రాష్ట్రంలో 743 రోడ్లు ధ్వంసం అయ్యాయని, షిమ్లా-ఛండీగఢ్ రోడ్ మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడిందని పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలోని మొత్తం మృతుల్లో ఒక్క మండి జిల్లాలోనే 13 మంది మరణించారని, ఈ జిల్లాలో తీవ్ర వరదలతో పాటు భారీ ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చైదరి అన్నారు. నాలుగు గంటలపాటు నేషనల్ డాజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్ అనంతరం మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించామని అన్న ఆయన.. తప్పిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Ambedkar photo in savarna attire: హిందూ సంప్రదాయ దుస్తుల్లో అంబేద్కర్.. కేరళలో తీవ్ర దుమారం