22ఏళ్ల వ్యక్తి బ్రేక్ అప్ చెప్పాడంటూ 60ఏళ్ల మహిళ కంప్లైంట్

22ఏళ్ల వ్యక్తి బ్రేక్ అప్ చెప్పాడంటూ 60ఏళ్ల మహిళ కంప్లైంట్

Updated On : January 26, 2020 / 3:14 AM IST

60ఏళ్ల మహిళతో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడో 22ఏళ్ల వ్యక్తి. ఏం జరిగిందో ఏమో గానీ ఆమెకు బ్రేక్ చెప్పేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎట్మాడుద్దౌలాలో అంటే తాజ్‌మహల్‌కు సమీప నగరంలో జరిగింది. ఇందులో మరో విచిత్రమేమిటంటే ఆ మహిళ భర్త.. కొడుకు కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశారు. 

అదే సమయంలో ఆ యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి స్టేషన్ కు వచ్చాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు విడిపోవడమేంటని కాస్త తగవు నడిచింది. ఏడుగురికి తల్లి, ఏడుగురు మనవళ్లు ఉన్న మహిళ ప్రకాశ్ నగర్‌లో నివాసముంటుంది. ఆమె పక్కింటిలో ఉంటున్న వ్యక్తితో ప్రేమలో పడింది. పిల్లలు, మనవళ్లు ఎంత చెప్పినా ఆ ప్రేమ జంటను విడదీయలేకపోయారు. 

పెళ్లి వరకూ వెళతామని ఒకరికొకరు మాటిచ్చుకున్న కొంతకాలానికి విభేదాలేమీ లేకుండానే ఆ యువకుడు పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. అంతే ప్రశాంత వాతావరణంలో రచ్చచేయడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత కుటుంబంతో సహా ఆ 22ఏళ్ల వ్యక్తిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేందుకు బయల్దేరింది.