ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే మూసివేయడం వల్ల గురువారం( ఫిబ్రవరి 7,2019)న 230 విమానలు రద్దయ్యాయి. ఎయిర్‌పోర్టులోని రెండు రన్‌వేల పునరుద్దరణ పనుల కారణంగా విమానాలు రద్దయినట్లు ఎయిర్‌పోర్టు ప్రతినిధి తెలిపారు.
పునరుద్దరణ, మరమ్మత్తు పనుల వల్ల ఫిబ్రవరి 7 నుంచి మార్చి 30 వరకు ప్రతీ వారంలో 3 రోజులపాటు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రన్ వేలు మూసివేయనున్నట్లు చెప్పారు.
రన్‌వే మూసివేత కారణంగా 33 శాతం విమానాలు ముంబై ఎయిర్‌పోర్టు నుంచి ఆలస్యంగా రాకపోకలను కొనసాగించాయని తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఆలస్యమయే, రద్దయే విమాన సర్వీసుల సంఖ్య పెరుగుతుందని వెల్లడించారు. ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతీ రోజు సుమారు 1000 విమానసర్వీసులు రాకపోకలను కొనసాగిస్తున్నాయి.