Lakhimpur Kheri Violence : మూడు రోజుల పోలీస్ కస్టడీకి కేంద్రమంత్రి కొడుకు

ఉత్తర్​ప్రదేశ్​ లోని లఖింపూర్​ ఖేరి జిల్లాలో ఈనెల 3న జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రాకు 3 రోజుల

Asish

Lakhimpur Kheri Violence  ఉత్తర్​ప్రదేశ్​ లోని లఖింపూర్​ ఖేరి జిల్లాలో ఈనెల 3న జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రాకు 3 రోజుల పోలీస్​ రిమాండ్​ విధిస్తూ లఖింపూర్​ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైతులను కారుతో తొక్కించిన కేసులో ఆశిష్‌పై సెక్షన్ 302, 304ఏ, 147, 148, 149, 279, 120బీల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 9న ఆశిష్‌ మిశ్రాను ఈ కేసు విషయమై పోలీసులు 12 గంటల పాటు విచారించారు. అనంతరం ఆశిష్​ మిశ్రాను అరెస్ట్​ చేశారు.

అయితే మిశ్రా దర్యాప్తునకు సహకరించట్లేదని.. ఈ కారణంగా ఆయనను పోలీస్​ రిమాండ్​కు అనుమతించాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేశారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణ చేపట్టిన చీఫ్​ జ్యుడిషియల్​ మెజిస్ట్రేట్ జస్టిస్​​ చింతారామ్​.. షరతుల మీద 3 రోజుల పోలీస్ రిమాండ్​కు అనుమతించారు. లాయర్​ సమక్షంలోనే మిశ్రాను ప్రశ్నించాలని, నిందితుడిని ఎలాంటి వేధింపులకు గురిచేయవద్దని పోలీసులకు కోర్టు సృష్టం చేసింది. ఇక,ఆశిష్ ఏ తప్పూ చేయలేదని, ఘటనకు సంబంధించిన 100కు పైగా ఫొటోలను, వీడియోలను పోలీసులకు ఇప్పటికే అందించామని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.

అక్టోబరు 3న లఖింపూర్​ ఖేరీలో జిల్లాలోని టికూనియా గ్రామ సరిహద్దు వద్ద నూతన సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో మరో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఓ డ్రైవర్ సహా ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆశిష్​ మిశ్రా తన కారుతో రైతులను తొక్కించారని.. ఈ క్రమంలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారని రైతులు ఆరోపిస్తున్నారుఅయితే ఈ ఆరోపణలను అజయ్ మిశ్రా ఖండించారు.

ALSO READ  రాజకీయ పార్టీల ఎలక్టోరల్ బాండ్ల విరాళాలు.. తెలుగు రాష్ట్రాల నుంచే టాప్-3 పార్టీలు