Regional parties: రాజకీయ పార్టీల ఎలక్టోరల్ బాండ్ల విరాళాలు.. తెలుగు రాష్ట్రాల నుంచే టాప్-3 పార్టీలు

రాజకీయ పార్టీలు తమ ఆదాయంలో సగానికిపైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఇచ్చే విరాళాల ద్వారా సేకరించినట్లు పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది.

Regional parties: రాజకీయ పార్టీల ఎలక్టోరల్ బాండ్ల విరాళాలు.. తెలుగు రాష్ట్రాల నుంచే టాప్-3 పార్టీలు

Parties

Regional parties: భారత్‌లో ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ ఆదాయంలో సగానికిపైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఇచ్చే విరాళాల ద్వారా సేకరించినట్లు పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) కొత్త నివేదిక ద్వారా వెల్లడించింది. ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా దేశంలోని 42 ప్రాంతీయ పార్టీలు రూ.447.498 కోట్లు సేకరించాయని నివేదిక స్పష్టం చేసింది. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్‌కి గాను.. వారి మొత్తం ఆదాయం రూ. 877.957కోట్లు కాగా.. అందులో 50.97 శాతం ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా వచ్చినట్లు నివేదిక పేర్కొంది.

రాజకీయ పార్టీలు ‘స్వచ్ఛంద నిధులు’ను ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూర్చుకుంటూ ఉంటాయి. రాజకీయ పార్టీల ఆదాయంలో స్వచ్ఛంద నిధులు 77.03 శాతం ఉన్నాయి. ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా విరాళాలు పొందడంలో అగ్రగామిగా టీఆర్ఎస్ పార్టీ నిలిచింది. ​దేశంలోని 42 ప్రాంతీయ పార్టీల్లో తొలి స్థానంలో టీఆర్ఎస్ నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.130.46కోట్ల ఆదాయాన్ని విరాళాల రూపంలో అర్జించింది టీఆర్ఎస్.

42 పార్టీలలో కేవలం 14 ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు తీసుకున్నట్లుగా ప్రకటించాయి. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), తెలుగుదేశం పార్టీ (TDP), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈమూడు పార్టీలు కూడా తెలుగు రాష్ట్రాల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

టీఆర్ఎస్ పార్టీ రూ. 89.15కోట్ల నిధులు ఎలక్టరోల్ బాండ్ల ద్వారా సమీకరించుకుని అగ్రస్థానంలో ఉంది. వివిధ మార్గాల ద్వారా రూ. 40.90కోట్ల నిధులను అర్జించాయి. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆదాయం రూ. 1306కోట్లు.

తెలుగుదేశం పార్టీ రూ. 81.60కోట్ల నిధులు ఎలక్టరోల్ బాండ్ల ద్వారా సమీకరించుకుని రెండవ స్థానంలో ఉంది. వివిధ మార్గాల ద్వారా రూ. 7.23కోట్ల నిధులు అర్జించగా.. డొనేషన్స్ రూపంలో మరో 2.70శాతం నిధులను సమకూర్చుకున్నాయి. మొత్తంగా టీడీపీ ఆదాయం రూ.91కోట్లు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూ. 74.35కోట్లను సమీకరించుకుని మూడో స్థానంలో ఉంది. రూ.9.32కోట్ల నిధులను డొనేషన్స్ ద్వారా.. రూ. 9.07కోట్ల నిధులను వివిధ మార్గాల ద్వారా సమీకరించుకున్నాయి. మొత్తంగా వైసీపీ ఆదాయం రూ.92కోట్లుగా ఉంది.