Septic Tank
Septic Tank: హర్యానాలోని నుహ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడితో సహా ముగ్గురు వ్యక్తులు సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన మంగళవారం జిల్లాలోని బిచోర్ గ్రామంలో జరిగింది.
ఎనిమిదేళ్ల బాలుడు ట్యాంక్ సమీపంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ట్యాంక్‌లో పడిపోవడంతో, బాలుడి తండ్రి, మరొకరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించి ట్యాంక్ లో పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దిను ఇంటి బయట 20 అడుగుల లోతులో సెప్టిక్ ట్యాంక్ నిర్మించారు. ట్యాంక్‌ను బండరాయితో మూసి ఉంచారు. మంగళవారం, దిను ఎనిమిదేళ్ల మనవడు ఆరిజ్ ట్యాంక్ సమీపంలో ఆడుకుంటున్నాడు. దానిపై నిలబడి ఉండగా కప్పు విరిగిపోయి అందులో పడిపోయాడని పోలీసులు తెలిపారు.
Read Also : విషాదం, సెప్టిక్ ట్యాంక్ లో బాలుడు..కాపాడేందుకు వెళ్లి..ఐదుగురు చనిపోయారు
బాలుడి తండ్రి సిరాజ్ (30), అతని మామ సలామ్ (35) బాలుడిని రక్షించే ప్రయత్నంలో ట్యాంక్‌లోకి దిగారు. ఎవరూ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో మునిగిపోయారు. ముగ్గురూ ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.