3 Army Personnel : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ వాహనం బోల్తా పడి 3 సైనికులు మృతి, ఐదుగురికి గాయాలు

3 Army Personnel Kill : జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది. బడిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది.

3 Army Personnel Kill : జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది. బడిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా అదనపు బలగాలను ఎన్‌కౌంటర్ స్పాట్‌కు తరలించారు. ఈ క్రమంలో జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం బోల్తా పడింది.

ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు. మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఆర్మీ వాహనం కనిపోరా గ్రామం సమీపంలో బోల్తా పడిందని రక్షణ శాఖకు చెందిన శ్రీనగర్‌ పీఆర్వో వెల్లడించారు. ఎన్ కౌంటర్ స్పాట్ కు వెళ్లే దారిలో రహదారి తడిగా ఉండటంతో డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు.

దాంతో ఆర్మీ వాహనం రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన 8 మంది సైనికులను సమీప ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రమాదంలో ఇద్దరు సైనికులు అక్కడిక్కడే మృతిచెందగా, మరో జవాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు అధికారులు పేర్కొన్నారు. గాయపడిన మరో ఐదుగురు సైనికులను శ్రీనగర్ బేస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.

Read Also :  The Kashmir Files: మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’

ట్రెండింగ్ వార్తలు