Encounter In Srinagar..ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్​లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శ్రీ నగర్​లోని రాంభాగ్​లో ప్రాంతంలో బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా

Kashmir

Encounter In Srinagar   జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్​లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శ్రీ నగర్​లోని రాంభాగ్​లో ప్రాంతంలో బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా.. ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా? అని తెలుసుకునేందుకు బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

అయితే, ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల గురించి వివరాలు తెలియాల్సి ఉంది. వీరికి సంబంధించిన వివరాలపై భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో భద్రతను మరింత పటిష్ఠం చేశారు

మరోవైపు,శనివారం తెల్లవారుజామున కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్‌ఎం) ఉగ్రవాద సంస్థ జిల్లా కమాండర్‌ ముదాసిర్ అహ్మద్ వాగే హతమైన విషయం తెలిసిందే.

ALSO READ Rajasthan : రోడ్లు కత్రినా బుగ్గల్లా ఉండాలి, నెటిజన్ల ఫైర్..వీడియో వైరల్