మరో 33మంది BSF జవాన్లకు కరోనా పాజిటివ్

గడిచిన 24 గంటల్లో 33 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో బీఎస్ఎఫ్ లో కరోనా సోకినా వారి సంఖ్య 944కు చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 302 యాక్టీవ్ కేసులుండగా,637మంది కరోనా నుంచి కోలుకున్నట్లు,5మరణాలు నమోదయినట్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 5లక్షల 30వేలు దాటగా, 16వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. కాగా, గడిచిన 24గంటల్లో రికార్డ్ స్థాయిలో దేశంలో 19,906 కరోనా కేసులు నమోదయినట్లు ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అయితే ఈ వ్యాధికి గురైన రోగులలో 58.56 శాతం మంది ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, కోలుకున్న వారి సంఖ్య యాక్టీవ్ కేసుల కంటే ఎక్కువ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు రెండు లక్షలు మాత్రమే ఉన్నారు.