Surajkund Crafts Mela: రెండేళ్ల అనంతరం ప్రారంభమైన “సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా”

భారత దేశ హస్తకళలు, సాంస్కృతిక స్వరూపాన్ని ప్రపంచానికి పరిచేయంచేసే దిశగా ప్రతి ఏటా నిర్వహించే "సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా" మంగళవారం ప్రారంభమైంది.

Surajkund

Surajkund Crafts Mela: భారత దేశ హస్తకళలు, సాంస్కృతిక స్వరూపాన్ని ప్రపంచానికి పరిచేయంచేసే దిశగా ప్రతి ఏటా నిర్వహించే “సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా” ప్రారంభమైంది. హర్యాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్య అతిధులుగా పాల్గొని ఈ మేళాను ప్రారంభించారు. ఫరీదాబాద్‌లోని దంతేశ్వరి గేట్ వద్ద 35వ సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా” ప్రారంభించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా మేళాను రద్దు చేసిన నిర్వాహకులు.. ఈ ఏడాది అట్టహాసంగా తిరిగి ప్రారంభించారు. భారత్ సహా..ఇతర భాగస్వామ్య దేశం నుంచి వేల మంది చేనేత కళాకారులూ, సాంస్కృతిక కళాకారులూ వివిధ రంగాల నిపుణులు ఈ మేళాలో పాల్గొంటారు. ఈ ఏడాదికిగానూ భారత్ – ఉజ్బెకిస్తాన్ భాగస్వామ్యంతో “సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా” ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో పాటు.. 30 దేశాల కళాకారులూ ఈ మేళాలో పాల్గొన్నారు. మొత్తం 1100 స్టాల్స్ లో సంస్కృతిక, సాంప్రదాయ కళాఖండాలు మరియు వంటకాలను ప్రదర్శించనున్నారు.

Also read:WhatsApp Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ఫీచర్ వచ్చేసింది..!

35వ సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా హర్యాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. “ఉజ్బెకిస్తాన్ – భారతదేశం బలమైన సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నాయని.. భారతీయ సినిమాల పట్ల ఉజ్బెక్‌లకు ఉన్న ప్రేమ వారితో ప్రత్యేక బంధం పెనవేసుకుందని” అన్నారు. “ఈ మేళాలో కళాకారులకు సంపాదనతో పాటు ఎగుమతిదారులు మరియు కొనుగోలుదారులతో పరస్పరం వ్యాపార అవకాశాన్ని కూడా కల్పిస్తుందని” దత్తాత్రేయ అన్నారు. చేతివృత్తులు మరియు కళాకారులను ప్రోత్సహించడంలో హర్యాణా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలను ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసించారు.

Also read:Lalu Prasad Health: మరింత క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం: రిమ్స్ నుంచి ఎయిమ్స్ కి తరలింపు

ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న ఈమేళాకు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు సందర్శకులను అనుమతించనున్నారు. ఈ ఏడాది కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ థీమ్ స్టేట్‌గా ప్రకటించబడింది. ఆ రాష్ట్ర సంస్కృతి మరియు సంప్రదాయాలు ప్రధానంగా ప్రదర్శించబడనున్నాయి. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది సందర్శకులు ఈమేళాకు రానున్నారు. సందర్శకుల భద్రత దృష్ట్యా మేళా ఏర్పాటు చేసిన పరిసర ప్రాంతాల్లో 300 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ నిమిత్తం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.

Also read:Household Budget : నిత్యావసర ధరలు పెరిగాయి.. మార్చిలో మీ ఇంటి బడ్జెట్ ఎంత పెరిగిందో చూశారా?