Lalu Prasad Health: మరింత క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం: రిమ్స్ నుంచి ఎయిమ్స్ కి తరలింపు

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో రాంచీ రిమ్స్ లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ ను ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించనున్నరు

Lalu Prasad Health: మరింత క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం: రిమ్స్ నుంచి ఎయిమ్స్ కి తరలింపు

Lalu Prasad

Lalu Prasad Health: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో రాంచీ రిమ్స్ లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ ను..వైద్యులు మంగళవారం ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించనున్నట్లు రిమ్స్ అధికారులు వెల్లడించారు. “లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, ఆయనకు అత్యవసరంగా డయాలిసిస్ చేయాల్సిన అవసరం ఉండడంతో ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించాలని సూచించామని” రాంచీ రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర ప్రసాద్ తెలిపారు. జైలు అధికారుల నుంచి అనుమతి వచ్చిన అనంతరం లాలూను ఢిల్లీకి తరలించనున్నట్లు కామేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు.

Also read:Household Budget : నిత్యావసర ధరలు పెరిగాయి.. మార్చిలో మీ ఇంటి బడ్జెట్ ఎంత పెరిగిందో చూశారా?

దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ గత కొన్ని రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, జైలు అధికారుల పర్యవేక్షణలో రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో లాలూ చికిత్స పొందుతున్నారు. లాలూ చికిత్స తీసుకుంటున్న సమయంలోనే దొరండా ట్రెజరీ నుంచి అక్రమంగా విత్‌డ్రా చేసిన కేసులో లాలూకు మరో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ కోర్టు. దీంతోపాటు రూ.60 లక్షల జరిమానా చెల్లించాలని ఫిబ్రవరి 21న సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.

Also Read:Zomato Delivery: పది నిముషాల్లో ఫుడ్ డెలివరీ? జొమాటోకు ఇది ఎలా సాధ్యం?

దాణా కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ మొత్తం ఐదు కేసుల్లో దోషిగా తేలారు. మొత్తం రూ.950 కోట్ల విలువైన దాణా కుంభకోణంలో లాలూ హస్తం ఉన్నట్లు సీబీఐ తేల్చింది. దీంతో 1997లో మొదటిసారిగా సీబీఐ ఛార్జ్ షీట్ లో లాలూ ప్రసాద్ పేరును చేర్చారు. అనంతరం జరిగిన విచారణలో లాలూ ప్రసాద్ ను దోషిగా నిర్ధారిస్తూ 2018 జనవరిలో లాలూ ప్రసాద్ కు జైలు శిక్ష విధించింది సీబీఐ. దీంతో ఆయన బిర్సా ముండా హోత్వార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Also read:Jayalalithaa Death Mystery : జయలలిత ఆరోగ్యంపై శశికళ నాతో ఇదే మాట చెప్పారు : పన్నీర్‌సెల్వం