Jayalalithaa Death Mystery : జయలలిత ఆరోగ్యంపై శశికళ నాతో ఇదే మాట చెప్పారు : పన్నీర్‌సెల్వం

Jayalalithaa Death Mystery : తమిళనాడు మాజీ సీఎం దివంగత నాయకురాలు జయలలిత డెత్ మిస్టరీ ఇప్పటికీ వీడనే లేదు. జయలలిత మృతిపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది.

Jayalalithaa Death Mystery : జయలలిత ఆరోగ్యంపై శశికళ నాతో ఇదే మాట చెప్పారు : పన్నీర్‌సెల్వం

Jaya Death Probe Panel Ops To Jaya Death Probe Panel Sasikala Told Me A Few Times That Jayalalithaa Was Doing Fine

Jayalalithaa Death Mystery : తమిళనాడు మాజీ సీఎం దివంగత నాయకురాలు జయలలిత డెత్ మిస్టరీ ఇప్పటికీ వీడనే లేదు. జయలలిత మృతిపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. జయలలిత ఎలా చనిపోయారు అనేది తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ ఒక్కొక్కరిని విచారిస్తోంది. విచారణలో భాగంగా అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) రెండో రోజు ఆరుముగసామి కమిషన్‌ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా పన్నీరు సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యం బాగానే ఉందని కొన్నిసార్లు తనతో చిన్నమ్మ శశికళ చెప్పారని పన్నీరుసెల్వం బయటపెట్టారు. జయ మృతిపై తనకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. కేవలం ప్రజల్లోనే అలాంటి అనుమానాలు ఉన్నాయన్నారు.

జయలలితకు ఇచ్చిన ఆహారం గురించి నాకు తెలియదని, వ్యక్తిగతంగా, శశికళ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉందన్నారు. ఆమె పట్ల నాకు ఎంతో గౌరవం ఉందని మాజీ సీఎం చెప్పారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5, 2016న గుండెపోటుతో మరణించారు. దేశంలో అధికారంలో ఉండగానే మరణించిన మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా జయలలితనే.. అయితే, మార్చి 21, సోమవారం ఆరుముగసామి కమిషన్ ముందు హాజరైన సమయంలో OPS జయలలితను ఆసుపత్రిలో ఎందుకు చేర్చారో తనకు తెలియదని అన్నారు. జయలలితకు చేసిన చికిత్స గురించి గానీ, ఆమెకు చికిత్స చేసిన అపోలో వైద్యుల బృందం గురించి గానీ తనకు ఏమీ తెలియదని పేర్కొన్నారు.

Jaya Death Probe Panel Ops To Jaya Death Probe Panel Sasikala Told Me A Few Times That Jayalalithaa Was Doing Fine(1)

Jaya Death Probe Panel Ops To Jaya Death Probe Panel Sasikala Told Me A Few Times That Jayalalithaa Was Doing Fine

జయలలిత మరణవార్త కూడా ఆస్పత్రిలో ఆరోగ్య కార్యదర్శి నుంచి విన్న తర్వాత మాత్రమే తనకు తెలిసిందన్నారు. 2016లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జయలలిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఆ మాట నేను అనలేదు.. పన్నీర్ సెల్వం క్లారిటీ :

విచారణ కమిటీ ముందు మొదటిరోజు విచారణకు హాజరైన పన్నీరుసెల్వం తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. జయలలితకు చికిత్స జరుగుతున్న సమయంలో సీసీ కెమెరాలను తొలగించాలని తాను చెప్పలేదన్నారు. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లాలని తీవ్రంగా ప్రయత్నించినట్టు చెప్పారు. జయలలిత డెత్ మిస్టరీకి సంబంధించి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ కుమార్, సీఎస్ రామ్ మోహన్ రావు లతో చర్చించానని తెలిపారు. ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదన్నారు.

ఆ తరువాత శశికళ చొరవతోనే విదేశీ వైద్యులు వచ్చినట్టు ఓపీఎస్ చెప్పారు. జయలలితకు వారే ట్రీట్‌మెంట్ ఇచ్చారని కమిషన్‌కు ఓపీఎస్ వివరణ ఇచ్చారు. 2018లో జయ మృతి మిస్టరీని తేల్చేందుకు రిటైర్డ్ జస్టిస్ ఆర్ముగం నేతృత్వంలో విచారణ కమీషన్ ఏర్పాటు చేశారు. ఈ విచారణలో ఇప్పటికే పలువురిని ఆర్ముగం కమీషన్ విచారించింది. ఓపీఎస్‌ను విచారించేందుకు నోటీజులు జారీ చేసింది. అయితే, ఓపీఎస్ విచారణకు హాజరవలేదు. మరోసారి ఓపీఎస్‌కు సమన్లు జారీ కావడంతో ఒపిఎస్ విచారణకు హాజరయ్యారు.

Read Also : Tamil Nadu:‘నేను జయలలిత-శోభన్ బాబుల కూతుర్ని..వారసత్వ సర్టిఫికెట్ ఇవ్వండి’ అంటూ తహసీల్దార్ కార్యాలయంలో మహిళ హంగామా