Tamil Nadu:‘నేను జయలలిత-శోభన్ బాబుల కూతుర్ని..వారసత్వ సర్టిఫికెట్ ఇవ్వండి’ అంటూ తహసీల్దార్ కార్యాలయంలో మహిళ హంగామా

నేను జయలలిత-శోభన్ బాబుల కూతుర్ని..వారసత్వ సర్టిఫికెట్ ఇవ్వండి’ అంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ హంగామా చేసింది.

Tamil Nadu:‘నేను జయలలిత-శోభన్ బాబుల కూతుర్ని..వారసత్వ సర్టిఫికెట్ ఇవ్వండి’ అంటూ తహసీల్దార్ కార్యాలయంలో మహిళ హంగామా

Madurai Woman Applied As The Daughter Of Former Cm Jayalalitha

Madurai woman applied as the daughter of former CM Jayalalitha : తమిళనాడు మాజీ సీఎం జయలలిత చనిపోయాక ఆమె వారసులం మేమే అంటూ ఎంతోమంది బయటకు వచ్చారు. అది ఆమె ఆస్తిలో వాటాల కోసమా? లేదా నిజమైన వారుసులం అని నిరూపించుకోవటానికా? అనేది పక్కన పెడితే..జయలలతి వారసురాలిగా నానా హంగామా చేసినవారిలో ఆమె మేనకోడలు దీప మాత్రమే కోర్టులో విజయం సాధించి వారసురాలిగా చలామణి అవుతున్నారు. ఈక్రమంలో మరో మహిళ తాను జయలలితకు అసలు సిసలైన వారసురాలిని పైగా తాను శోభన్ బాబు..జయలలితలకు పుట్టిన బిడ్డను అంటూ తమిళనాడులోని మధురైకి చెందిన మీనాక్షి అనే 38 ఏళ్ల మహిళ తాజాగా హంగామా చేసింది. మధురైలో తహశీల్దార్ కార్యాయానికి వచ్చిన సదరు మహిళ తనకు వారసత్వపు సర్టిఫికెట్ ఇవ్వాలంటూ నానా హంగామా చేసిన ఘటనతో మరోసారి జయలలిత వారసుల విషయం మొదలైంది.

Also read : అమ్మ ఆశీర్వాదంతో అన్నాడీఎంకేను మళ్లీ కంట్రోల్లోకి తెచ్చుకుంటా..!

జయ అసలైన వారసురాలిని తానేనని ఆమె చెప్పుకుంటున్నారు. తన తండ్రి శోభన్‌బాబు, తల్లి జయలలిత అని చెబుంతోంది మీనాక్షి. జయలలిత మృతి చెందడంతో తనకు ఆమె కూతురుగా వారసత్వ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ జనవరి 27న ఆన్‌లైన్‌లో ఆమె దరఖాస్తు చేసుకున్నారామె.

కానీ నెల రోజులు దాటినా ఇంకా సర్టిఫికెట్ రాకపోవడంతో మీనాక్షి డైరెక్టుగా తాలూకా కార్యాలయానికి చేరుకుని సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదంటూ డిప్యూటీ తహసీల్దార్‌తో వాగ్వివాదానికి దిగింది.దీంతో డిప్యూటీ తహశీల్దారు రాజలక్ష్మి జయలలిత చెన్నైలో మృతి చెందారు కాబట్టి అక్కడికే వెళ్లి తీసుకోవాలని సూచించారు. దానికి ఆమె అంతెత్తును ఎగిరిపడ్డారు. ‘నేను అసలు సిసలైన వారసురాలిని పళనిలో బంగారు రథం లాగే హక్కును తన తండ్రి శోభన్‌బాబు తనకు ఇచ్చారు దానికి సంబంధించిన పేపర్లు తన వద్ద ఉన్నాయి’అంటూ వారసత్వ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వరంటూ నానా రభస చేసింది.

Also read : Jayalalitha : జయలలితకు ఏం మందులు ఇచ్చారు..? మెడికల్ బోర్డు తేల్చాలన్న సుప్రీం

వారసత్వం విషయంలో మీరు కోర్టుకు వెళ్లి ఆ విషయం తేల్చుకోండీ అని తహశీల్దార్ కార్యాలయం అధికారులు ఆమెకు పలు విధాలుగా నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.ఈ విషయం గురించి మీనాక్షి మాట్లాడుతూ.. ‘జయలలిత అసలు సిసలైన వారసురాలిని తానేనని..నేను జయలలిత-శోభన్ బాబుల కుమార్తెను..చిన్నప్పుడు ఆమె నన్ను వదిలించుకుంది..బామ్మే తనను పెంచింది’అని చెప్పుకొచ్చింది. ఈ విషయం కోర్టుకు వెళ్లే విషయంలో తాను త్వరలోనే నిర్ణయించుకంటానని చెప్పుకొచ్చింది. కాగా మధురై, డిఆర్‌ఓ కాలనీ, తిరువళ్లువర్‌కు చెందిన మీనాక్షి భర్త మరుగేశన్ అని తెలుస్తోంది.