Jayalalitha : జయలలితకు ఏం మందులు ఇచ్చారు..? మెడికల్ బోర్డు తేల్చాలన్న సుప్రీం

హాస్పిటల్ లో జయలలితకు ఎటువంటి వైద్యం అందింది.. ఎటువంటి మందులు ఇచ్చారు.. జయలలిత ఆరోగ్యం ఎలా దిగజారింది.. అనేది తెలుసుకోవడం దర్యాప్తులో కీలకమే.

Jayalalitha : జయలలితకు ఏం మందులు ఇచ్చారు..? మెడికల్ బోర్డు తేల్చాలన్న సుప్రీం

Jayalalitha Death Case Enquiry

Jayalalitha : దివంగత సీఎం జయలలిత మృతి కేసులో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తు జరుపుతున్న కమిషన్ ప్యానెల్ కు సహకరించేలా.. మెడికల్ బోర్డును ఏర్పాటుచేయాలని సూచించింది. జస్టిస్ SA నజీర్, జస్టిస్ మురారిలతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. డాక్టర్లు, స్పెషలిస్టులతో కూడిన మెడికల్ బోర్డును నామినేట్ చేయాలని.. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) డైరెక్టర్ కు సూచించింది సుప్రీం కోర్టు.

Read Also : Jayalalithaa’s Home : జయలలిత నివాసాన్ని స్వాధీనం చేసుకున్న దీప

2016లో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో 76 రోజుల పాటు చికిత్స పొందిన జయలలిత అదే ఏడాది డిసెంబర్ 5న కన్నుమూశారు. సుదీర్ఘ కాలం చికిత్స తర్వాత.. ఆమె మృతిని అధికారికంగా ప్రకటించారు డాక్టర్లు. జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ దాఖలైన పిటిషన్లపై గతంలోనే మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. 2019, ఏప్రిల్ 4న జస్టిస్ తిరు ఎ.ఆర్ముగస్వామి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్యానెల్ ను ఏర్పాటుచేసింది.

జయలలితకు హాస్పిటల్ లో డాక్టర్లు ఏం మందులు ఇచ్చారు.. అవి సరిపోయాయా లేక.. ఓవర్ డోస్ అయ్యాయా.. అందించిన ట్రీట్ మెంట్ సరైనదేనా కాదా.. అనేది తేల్చాలని ప్యానెల్ కు మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈ విషయంలో తాము కలగజేసుకోబోమని.. తమిళనాడు ప్రభుత్వమే అధికారులు, నిపుణులను కేటాయించి దర్యాప్తు ప్యానెల్ కు సహకరించాలని కోరింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై.. అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీని విచారించిన సుప్రీంకోర్టు.. దర్యాప్తు ప్యానెల్ కు సహకరించేలా మెడికల్ బృందం ఏర్పాటుచేయాలని AIIMSకు సూచించింది.

Read Also : Jayalalithaa’s Home : జయలలిత నివాసం స్వాధీనం..ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసిన హైకోర్టు

“హాస్పిటల్ లో జయలలితకు ఎటువంటి వైద్యం అందింది.. ఎటువంటి మందులు ఇచ్చారు.. జయలలిత ఆరోగ్యం ఎలా దిగజారింది.. అనేది తెలుసుకోవడం దర్యాప్తులో కీలకమే. హాస్పిటల్ ప్రొసీడింగ్స్ అన్నీ తెలుసుకుని మెడికల్ బోర్డు ఓ రిపోర్టును రెడీ చేయాలి. దీనిని దర్యాప్తు జరుపుతున్న కమిషన్ ప్యానెల్ కు అందజేయాలి. మెడికల్ బోర్డు ఏర్పాటుచేయాలని కమిషన్ కోరడం ఆహ్వానించదగినదే.” అని సుప్రీం బెంచ్ కామెంట్ చేసింది.