Jayalalithaa’s Home : జయలలిత నివాసాన్ని స్వాధీనం చేసుకున్న దీప

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలితకు చెందిన "వేదనిలయం(చెన్నై పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసం)"తాళాలు ఎట్టకేలకు ఆమె మేనకోడలు దీపకు దక్కాయి. మద్రాస్ హైకోర్టు ఆదేశాల

Jayalalithaa’s Home : జయలలిత నివాసాన్ని స్వాధీనం చేసుకున్న దీప

Poes Garden2

Jayalalithaa’s Home :  తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలితకు చెందిన “వేదనిలయం(చెన్నై పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసం)”తాళాలు ఎట్టకేలకు ఆమె మేనకోడలు దీపకు దక్కాయి. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు చెన్నై కలెక్టర్‌ విజయరాణి “వేదనిలయం” తాళాలను అధికారికంగా దీపకు అందచేశారు. దీంతో శుక్రవారం సాయంత్రం దీప తన భర్త మాధవన్‌, మరి కొందరితో కలిసి ఆ నివాసానికి చేరుకున్నారు. జయలలిత చిత్రపటానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. తన మేనత్త నివసించిన ఇంటిలోకి అడుగుపెట్టిన దీప చాలా సంతోషంగా కనిపించారు. వేదనిలయాన్ని తనకు అప్పగించడంతో ఇప్పుడు తన మేనత్త జయలలిత ఆత్మ శాంతిస్తుందని దీప అన్నారు

ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ…”‘అత్త (జయలలిత) లేకుండా నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఈ ఇల్లు నిర్మానుష్యంగా, ఖాళీగా ఉంది. మా అత్త ఉపయోగించిన ఫర్నిచర్‌ను తొలగించారు” అని లిపారు. తన అత్త జయలలితకు చెందిన ఈ ఇంట్లో తాను నివాసం ఉంటానని ఆమె చెప్పారు. ఇక్కడికి రాకుండా తనను అడ్డుకోవడానికి చాలామంది కుట్ర చేశారని, కానీ న్యాయం తన వైపే ఉందని దీప తెలిపారు. ఇకపై వేదనిలయం నిర్వహణ బాధ్యతలను తామే చూసుకుంటామని తెలిపారు. తమ మేనత్త ఇంటిపై రాజకీయాలు అనవసరం దీప వ్యాఖ్యానించారు.

కాగా, జయలలిత మరణాంతరం ఆమె నివాసమైన వేద నిలయాన్ని నాటి అన్నాడీఎంకే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. జయలలిత స్మారక మందిరంగా దీనిని తీర్చిదిద్దుతామని పేర్కొంది. ఈ భవనం స్వాధీనానికి డబ్బులను కూడా కోర్టుకు జమ చేసింది. అయితే జయలలిత ఆస్తులకు తామే వారసులమంటూ ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. పోయెస్ గార్డెన్ నివాసాన్ని అన్నాడీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్‌ చేశారు.

ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు దీప, దీపక్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వేద నిలయాన్ని జయలలిత వారసులకు అప్పగించాలని హైకోర్టు సింగిల్ బెంచ్‌ ధర్మాసనం నవంబర్‌ 24న ఆదేశించింది. దిగువ కోర్టులో డిపాజిట్‌ చేసిన డబ్బును వెనక్కి తీసుకోవాలని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు చెన్నై జిల్లా కలెక్టర్‌ వేద నిలయం తాళాలను దీప, దీపక్‌కు అప్పగించారు. మరోవైపు హైకోర్టు ఆదేశాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేస్తామని అన్నాడీఎంకే తెలిపింది.

ALSO READ Bipin Rawat in Leaf Art : రావిఆకులో బిపిన్‌ రావత్ రూపం..కళాకారుడి ‘పత్ర’ నివాళి!…