Third Wave
3rd Covid wave: ఒమిక్రాన్ కేసులు మొత్తం సంఖ్య దేశంలో పెరుగుతూ ఉన్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మూడో వేవ్‌కి కారణం కావచ్చనే అంచనాలు కూడా వ్యక్తం అవుతూ ఉండగా.. ఐఐటి కాన్పూర్(IIT-K) పరిశోధకులు కూడా ఇదే విషయంపై పరిశోధించి అంచనాలు వెల్లడించారు.
ఆన్‌లైన్ ప్రిప్రింట్ హెల్త్ సర్వర్ MedRxలో ప్రచురించబడిన నివేదిక ప్రకారం,”ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్‌లను అనుసరించి భారతదేశం మూడవ వేవ్ డిసెంబర్ మధ్యలో ప్రారంభమై ఫిబ్రవరి ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఈ ప్రాజెక్ట్ నివేదిక అంచనా వేసింది”.
ఈ ఐఐటీ టీమ్ Gaussian అనే గణాంకాన్ని ఉపయోగించి అంచనాలను రూపొందించింది. మూడవ వేవ్ అంచనా వేయడానికి నమూనాలను సేకరించినట్లు చెప్పారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌ల డేటాను పరిశీలిస్తే, దేశంలో మూడవ తరంగాన్ని అంచనా వేయడానికి అనేక దేశాలలో ఓమిక్రాన్ కేసుల ప్రస్తుత పెరుగుదల ఆందోళనకరంగానే ఉంది.
రిపోర్ట్‌ల ప్రకారం.. ఫిబ్రవరి ప్రారంభంలో గరిష్ఠ స్థాయికి కరోనా పరిస్థితి చేరవచ్చని అంచనా వేసిందని అంచనా వేస్తున్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 6 వేల 650 కొత్త కేసులు రాగా.. ఇదే సమయంలో 374 మంది చనిపోయారు.