Uttarakhand Tunnel : ఉత్తరాఖండ్ టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కార్మికులు… 11 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

బార్ కోట్ వైపు నుంచి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికన్ ఆగర్ మెషిన్ తో రాత్రంతా డ్రిల్లింగ్ కొనసాగింది.

Uttarakhand Tunnel Workers Trapped : ఉత్తరాఖండ్ లోని టన్నెల్ కుప్పకూలిపోవడంతో 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు 11 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బార్ కోట్ వైపు నుంచి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికన్ ఆగర్ మెషిన్ తో రాత్రంతా డ్రిల్లింగ్ కొనసాగింది. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి మైక్రో టన్నెల్ కోసం తవ్వకాలు జరుపుతున్నారు.

సహాయక బృందాలు 32 మీటర్ల మేర పైపులను లోపలికి పంపించారు. ఉత్తరకాశీ-యమునోత్రి రహదారిపై ఉన్న నాలుగున్నర కిలో మీటర్ల టన్నెల్ నిర్మాణంలో మధ్యలో కూలింది. నవంబర్ 12న టన్నెల్ లో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. టన్నెల్ లో చిక్కుకున్నవారికి ఆక్సిజన్‌, ఆహారం, నీరు అందుతోంది. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులకు 40 మీటర్ల మేర 6 అంగుళాల పైపులైన్‌ను వేసి అధికారులు ఆహారం అందిస్తున్నారు.

ICC Bans Transgender : అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ ప్లేయర్స్ పై ఐసీసీ నిషేధం.. ఎందుకంటే?

టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికుల దృశ్యాలు విడుదల
లోపల చిక్కుకున్న కార్మికులతో కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికుల దృశ్యాలు విడుదల చేశారు. అధికారులు పైప్‌లైన్ ద్వారా ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా పంపారు. అధికారులు నిన్నటి నుంచి కార్మికులకు వేడి వేడి ఆహారం అందిస్తున్నారు. అంతకుముందు డ్రై ఫ్రూట్స్, నీళ్లు పంపారు. టన్నెల్ లోపల వైఫై కనెక్షన్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండు డీఆర్డీఓ రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. నేషనల్ హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ,రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్,సట్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ సహా పలు ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ కూడా సహాయకచర్యల్లో భాగమవుతున్నాయి.

National Herald Case : సోనియా, రాహుల్ లకు ఈడీ భారీ షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.752 కోట్ల ఆస్తులు అటాచ్

సీఎం పుష్కర్ సింగ్ కు ఫోన్ చేసిన ప్రధాని
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామికి ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఉత్తరకాశీలోని సిల్క్యారాలో టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై ఆరా తీశారు. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులకు ఆహారం, మందులు ఇతర అవసరమైన వస్తువులను అందించడానికి, కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ల గురించి ప్రధాని తెలుసుకున్నారు. కేంద్ర ఏజెన్సీలు, అంతర్జాతీయ నిపుణులు, రాష్ట్ర పరిపాలన మధ్య పరస్పర సమన్వయంతో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ల గురించి ప్రధానికి సీఎం పుష్కర్ సింగ్ తెలిపారు.

గత 24 గంటల్లో సాధించిన సానుకూల పురోగతితో కార్మికులు వారి కుటుంబాలతో మాట్లాడటంతో మనో ధైర్యంతో ఉన్నారని ప్రధానికి పుష్కర్ సింగ్ వివరించారు. కార్మికులను బయటకు తీసుకురావడానికి ప్రధాన మంత్రి నుండి నిరంతర మార్గదర్శకత్వం పొందుతున్నామని పేర్కొన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రధాని తీసుకుంటున్న చొరవ ప్రతిరోజూ కొత్త శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు