కూతురు పుడితే ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది అని మురిసిపోయే తల్లిదండ్రులు తమ ఇంటికి వచ్చిన కోడలు కూడా లక్ష్మీదేవే అని ఎంతమంది అనుకుంటారు చెప్పండి. తమకు ఎంత ఆస్తిపాస్తులున్నా..కొడుకు భార్యగా వచ్చే కోడలు ఎంత కట్నం తెస్తుంది? ఎంత బంగారం తెస్తుంది అనే అనుకుంటుంటారు. కానీ కోడలంటే లక్ష్మీదేవి అటువంటి లక్ష్మీదేవే మన ఇంటికి వస్తున్నప్పుడు తనకు ప్రత్యేకించి కట్నకానుకలెందుకు అనుకుంటోంది ఇండోర్ లోని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని నివసించే ఫతేచందాని కుటుంబం.
ఫతేచందాని కుటుంబంలో ఆడపిల్లలకు కట్నం ఇవ్వరు..వారి ఇంట్లో అబ్బాయిలకు పెళ్లి చేస్తే కట్నం తీసుకోరు. గత 42 సంవత్సరాల్లో వారి ఇంట్లో ఆరుగురి పెళ్లిళ్లు జరిగాయి. ఈ పెళ్లిళ్లకు ఎటువంటి కట్నకానుకలు తీసుకోలేదు ఇవ్వలేదు. కానీ వారింటి సంప్రదాయం ప్రకారం కేవలం ఐదు కిలోల పటిక పంచదార, 11 కొబ్బరికాయలు మాత్రమే కట్నంగా తీసుకుంటారు.
ఫలేచందానీ కుటుంబంలోని అనిల్ ఫతేచందానీ ఓ ప్రైవేటు స్కూల్లో టీచరర్ గా చేస్తుంటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమది ఉమ్మడి కుటుంబం అనీ..ఇప్పటికీ అందరం కలిసే ఉంటున్నామని తెలిపారు. నాకు నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు. మా తండ్రి అగరబత్తీల ఫ్యాక్టరీ నిర్వహిస్తుంటారని తెలిపారు. 1978లో పెద్దన్నయ్య కిషోర్ కుమార్ పెళ్లయ్యింది. మా నాన్న ఎటువంటి కట్నకానుకలు తీసుకోలేదు. తమ కుటుంబాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకుని చాలా కుటుంబాలు కట్నాలు తీసుకోవటంలేదనీ ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు.
గత 42 ఏళ్లలో తమ కుటుంబంలో మొత్తం ఆరుగురికి వివాహాలు జరిగాయన్నారు. పెళ్లికి వచ్చినవారి నుంచి కానుకలు తీసుకోలేని అన్నారు. మొత్తం 21 మంది కుటుంబ సభ్యులం ఒకే ఇంట్లో ఉంటామని..అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉంటున్నామని తెలిపారు అనిల్ ఫతేచందానీ. అంతేకాదు తమ ఇంట్లో ఏ పెళ్లిళ్లుగానీ, శుభకార్యాలు జరిగినా అతిథుల నుంచి ఎటువంటి గిఫ్టులు తీసుకోమని అన్నారు. శుభలేఖల్లో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రింట్ చేయిస్తామని తెలిపారు. బావమరిది రాజ్‌కుమార్ లెహర్వానీ కొడుకు ఆశిష్ పెళ్లి (2019) లో జరిగింది. ఆ పెళ్లికి కట్నం తీసుకోలేదని అనిల్ చెప్పారు.