CJI Nalsar Students : నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ వద్దు.. 450 మంది విద్యార్థుల తీవ్ర అభ్యంతరం!
CJI Nalsar Students : నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను పిలవవద్దంటూ 450 మంది విద్యార్థుల లేఖ రాయడం చర్చనీయాశంగా మారింది.
CJI Nalsar Students
- సీజేఐ ఆహ్వానంపై విద్యార్థుల నిరసన
- సీజేఐ వద్దంటూ నల్సార్ విద్యార్థుల గళం
- స్నాతకోత్సవానికి పిలవొద్దంటున్న నల్సార్ విద్యార్థులు
CJI Nalsar Students : భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి చీప్ గెస్ట్‌గా ఇన్వైట్ చేసే ప్రతిపాదనను నల్సార్ లా యూనివర్శిటీ విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నీట్ నిరసనలపై విచారణ సమయంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను స్నాతకోత్సవానికి పిలవవద్దని కోరుతూ 450 మందికి పైగా విద్యార్థులు యూనివర్శిటీ యాజమాన్యానికి లేఖ రాశారు.
నల్సార్ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసే కార్యక్రమానికి సీజేఐ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని యూనివర్శిటీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయంపై విద్యార్థుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 2026 బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల బృందం ఈ మేరకు యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్, రిజిస్ట్రార్, అధ్యాపకులు, పరిపాలనా విభాగాలకు లేఖ రాసింది.
యువతను ‘బొద్దింకలు’తో పోల్చారంటూ గతంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలు, జంతర్ మంతర్ నిరసనలపై ఆయన చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలు, పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన వీడియోలపై స్పందన వంటి అంశాలను విద్యార్థులు తమ అభ్యంతరాలకు కారణాలుగా ప్రస్తావించారు.
Read Also : Medico Priyanka : మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్.. కిమ్స్ వైద్యులు వెల్లడి!
‘న్యాయాన్ని చదివిన మాకు.. న్యాయవ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తిన వ్యక్తి చేతుల మీదుగా డిగ్రీ తీసుకోవడం సరైనదేనా?’ అన్న భావన తమలో ఉందని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. స్నాతకోత్సవం తమ విద్యా జీవితంలో ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఘట్టమని, అలాంటి రోజున తమ విలువలకు విరుద్ధంగా అనిపించే నిర్ణయం ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే, బొద్దింకలు, వీడియోలకు సంబంధించిన తన వ్యాఖ్యలను సీజేఐ సూర్యకాంత్ ఇప్పటికే వివరణ ఇచ్చారని, మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని పేర్కొన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఆగస్టులో నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ ఏర్పాట్లు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల అభ్యంతరాలపై నల్సార్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
