వారానికి 5రోజులే…కరోనా కట్టడికి యూపీలో మినీ లాక్ డౌన్ ఫార్ములా

పెరుగుతున్న కరోనావైరస్ కేసులను అరికట్టే ప్రయత్నం భాగంగాలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో “మినీ లాక్ డౌన్” ఫార్ములా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మినీ-లాక్‌డౌన్ స్కీంలో భాగంగా… కరోనావైరస్ కేసుల వ్యాప్తిని నియంత్రించడానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వారాంతపు లాక్‌డౌన్ విధిస్తుంది. అంటే రాష్ట్రంలో ప్రతి వారం శనివారం, ఆదివారం లాక్‌డౌన్ విధించబడుతుంది.

మినీ-లాక్‌డౌన్ ఫార్ములా ప్రవేశపెట్టడంతో, కార్యాలయాలు మరియు మార్కెట్లు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తాయి. శనివారం మరియు ఆదివారం మూసివేయబడతాయి.

మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం నాటికి 35,092 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, వీటిలో 11,490 యాక్టివ్ కేసులు ఉండగా, 22,689 మంది కోలుకున్నారు. 913 మంది మరణించారు, దేశంలో అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదవుతున్న 6 వ రాష్ట్రంగా యూపీ నిలిచింది.

కాగా, ఉత్తరప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు పెరుగుతుండటంతో అకస్మాత్తుగా మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త లాక్ డౌన్ విధించారు. కరోనా తీవ్రత దృష్ట్యా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు