చిరుత పులిని చంపి తిన్నారు, కేరళలో దారుణం

leopard and consuming its meat : కేరళ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. కొంతమంది వేటుగాళ్లు చిరుతపులిని చంపి ఏకంగా కూర వండుకుని తిన్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసిన అటవీ శాఖ పోలీసులు చిరుత పులి చర్మం, మిగిలిన పులి కూరను స్వాధీనం చేసుకున్నారు. ఇడుక్కి జిల్లాలోని మంకుళం అనే చిన్న పట్టణం అటవీ సరిహద్దుల్లో ఉంటుంది. వినోద్ మునిపారా వద్ద అటవీ ప్రాంతంలో 100 మీటర్ల దూరంలో ఒక ఉచ్చును బిగించాడు.

అందులో ఆరేళ్ల మగ చిరుత చిక్కుకుంది. Kuriakose సహాయంతో చిరుతను ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ దానిని చంపేశారు. దాని చర్మాన్ని విడదీసి..మాంసంతో కూర వండుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న Mankulam range officer VB Udaya Suryan, అతని టీం అక్కడకు వెళ్లింది. ఇంటి నుంచి దాదాపు 10 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు Mankulam divisional forest officer PJ Suhaib వెల్లడించారు. జంతువులను వేటాడిన చరిత్ర వారికి ఉందని, వేట అనే వ్యామోహం ఉందన్నారు. పందిని వేటాడి..దాని మాంసాన్ని తిన్నారని వెల్లడించారు.

చిరుతపులి వేటకు వినోద్ నాయకత్వం వహించినట్లు, ఇతర నిందితులు మాంసం తిన్నారని తెలిపారు. Kollikolavil Vinod PK (45), Basil Garden VP Kuriakose (74), Chempenpurayidathil CS Binu (50), Malayil Sali Kunjappan (54), Vadakkumchalil Vincent (50) లను అదుపులోకి తీసుకున్నారు. దోషులుగా తేలితే..ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని పోలీసులు వెల్లడించారు.