ఘోర అగ్నిప్రమాదం : ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి 

  • Publish Date - May 1, 2019 / 05:29 AM IST

ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు సజీవంగా దహనమైపోయారు. ఈ ఘోర దుర్ఘటన  ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఇందిరా నగర్‌ మాయావతి కాలనీలో చోటుచేసుకుంది. 

షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఈ మంటలు అక్కడే ఉన్న గ్యాస్‌ స్టౌవ్‌ గోడౌన్‌కు కూడా వ్యాపించాయి. దీంతో ప్రమాదస్థాయి మరింతగా పెరిగింది. భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. ఒకే కుటుంబంలో ఏకంగా ఐదుగురు వ్యక్తులు చనిపోవటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మృతుల బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.