Black Fungus: మధ్యప్రదేశ్‌లో 50 బ్లాక్ ఫంగస్ కేసులు, స్పెషల్ వార్డులకు ఆదేశం
కొవిడ్ రోగుల్లో 50 మందికి బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మికోసిస్) ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయం అక్కడి సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేక వార్డుల్లో ట్రీట్మెంట్ అందించాలనే ఆదేశాలిచ్చారు.

Black Fungus
Black Fungus: కొవిడ్ రోగుల్లో 50 మందికి బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మికోసిస్) ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయం అక్కడి సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేక వార్డుల్లో ట్రీట్మెంట్ అందించాలనే ఆదేశాలిచ్చారు. భోపాల్ హై లెవల్ మీటింగ్ ఏర్పాటు చేసి కొవిడ్ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
బ్లాక్ ఫంగస్, సాధారణ కరోనా ట్రీట్మెంట్ లకు తీవ్రతను బట్టి చికిత్స్ అందించాలని చెప్పారు. ఆర్థికంగా పేద వారైన పేషెంట్లకు ఉచిత చికిత్స అందిస్తామని అన్నారు. అటువంటి లక్షణాలు ఉన్న వారు ఎవరైనా.. ముందుకొచ్చి ట్రీట్మెంట్ సకాలంలో తీసుకోవాలని పిలుపునిచ్చారు.
హెల్త్ నిపుణుల ప్రకారం.. మ్యూకోర్మైకోసిస్ లక్షణాలు ఇలా ఉంటాయి. తలనొప్పి, జ్వరం, కంటి కింది భాగంలో నొప్పి, ముక్కు దిబ్బడ లేదా సైనస్ సమస్యలతో పాటు పాక్షికంగా చూపు కోల్పోయి మసకగా కనపబడుతుందని అన్నారు.
రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మినిష్టర్ విశ్వాస్ కైలాశ్ సారంగ్ మాట్లాడుతూ.. మేం హై అలర్ట్ గా ఉన్నాం. తొలి దశ సమయంలో భోపాల్ లోని గాంధీ మెడికల్ కాలేజిలో, జబల్‌పూర్లో స్పెషల్ ట్రీట్మెంట్ యూనిట్స్ ను ఏర్పాటు చేశాం. అని వివరించారు.