ఐదో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

  • Publish Date - April 10, 2019 / 03:32 PM IST

ఢిల్లీ: ఐదో విడత లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 51 స్ధానాలకు  మే 6 వ తేదీన ఐదో దశలో ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ లో 5, జమ్మూ కాశ్మీర్ 2, మధ్యప్రదేశ్ లో 7, ఝూర్ఖండ్ లో 4, రాజస్ధాన్ లో 12, ఉత్తర ప్రదేశ్ లో 14, పశ్చిమ బెంగాల్ లో 7 స్ధానాలకు ఐదో విడతలో పోలింగ్ జరుగుతుంది.

2019 లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో  ఏప్రిల్ 23 న మూడో విడతలో అత్యధికంగా 115 స్ధానాల్లో పోలింగ్ జరుగుతుండగా, ఐదో దశలో అత్యల్ప స్ధానాలకు పోలింగ్ జరగనుంది. 
ఐదో దశలో జరిగే ఎన్నికలకు నామినేషన్లు  ఏప్రిల్ 18 లోపు దాఖలు చేయవచ్చు. ఏప్రిల్ 20 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 22 లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. కాగా ఆరో దశ ఎన్నికలు మే 12న, ఏడోదశ ఎన్నికలు మే19 న నిర్వహిస్తారు. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు  వెల్లడిస్తారు.