Covid Vaccination In India : దేశంలో 60 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 60 శాతం మంది అర్హులకు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ

Covid Vaccination In India :  దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 60 శాతం మంది అర్హులకు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇప్పటివరకు 139.70 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను దేశ ప్రజలకు అందిచినట్లు ఆరోగ్య శాఖ మంత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. హెల్త్ వర్కర్ల అంకిత భావం, ప్రజల సానుకూల స్పందన కారణంగానే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఇక,దాదాపు 89శాతం మంది పెద్దలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించబడినట్లు ఆరోగ్యశాఖ తెలిపారు.

కాగా, జనవరి 16న దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించబడిన విషయం తెలిసిందే. మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు టీకాలు వేశారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమైంది. తదుపరి దశ టీకా మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి నిర్దిష్ట సహ-అనారోగ్య పరిస్థితులతో ప్రారంభించబడింది.

ఏప్రిల్ 1 నుంచి… 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ టీకా ఇవ్వడం ప్రారంభించింది ప్రభుత్వం. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయడానికి అనుమతించడం ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను విస్తరించింది.

ఇదిలాఉంటే,దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశంలోని కరోనా పరిస్థితిపై ఆయా శాఖల అధికారులతో ప్రధాని మోదీ గురువారం సాయంత్రం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ALSO READ Blast Inside Ludhiana Court : లుథియానా కోర్టులో పేలుడు..ఇద్దరు మృతి,నలుగురికి తీవ్ర గాయాలు

ట్రెండింగ్ వార్తలు