Arvind Kejriwal ED Custody : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ ను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Arvind Kejriwal ED Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో బిగ్ షాక్. కేజ్రీవాల్ కు కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ మేరకు జడ్జి జస్టిస్ కావేరీ బవేజా ఉత్తర్వులు వెలువరించారు. తదుపరి విచారణను మార్చి 28కి వాయిదా వేశారు. ఈ నెల 28వ తేదీ వరకు కస్టడీ విధించడంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను విచారించనున్నారు.

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ ను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం విదితమే.

కాగా, కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి కోరింది ఈడీ. అయితే, రౌస్ అవెన్యూ కోర్టు 6 రోజుల కస్టడీకే పర్మిషన్ ఇచ్చింది. ఈడీ రిమాండ్ ను వ్యతిరేకించాలన్న కేజ్రీవాల్ తరుపు న్యాయవాదుల వాదనలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను సూత్రధారిగా పేర్కొన్న ఈడీ.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) సెక్షన్ 19 ప్రకారం అరెస్ట్ చేసినట్లు తెలిపింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టులో చుక్కెదురైంది. కేజ్రీవాల్ ని ఈడీ కస్టడీకి అనుమతిస్తూ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ప్రశ్నించాల్సింది ఉందని, అనేక కోణాల్లో ఈ కేసు దర్యాఫ్తును ముందుకు తీసుకెళ్లాలని అందుకోసం కేజ్రీవాల్ ను 10రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా.. కోర్టు కేవలం 6 రోజుల కస్టడీకే అనుమతించింది. దీంతో కేజ్రీవాల్ ఈడీ విచారణను ఎదుర్కోబోతున్నారు. 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, మద్యం వ్యాపారులకు అనుకూలంగా పాలసీలో మార్పులు చేర్పులు చేయడం, సౌత్ గ్రూప్ పాత్ర, 100 కోట్ల ముడుపులకు సంబంధించిన వ్యవహారాలు, గోవా ఎన్నికల్లో రూ.45కోట్లు ఖర్చు చేశారన్న అంశాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీటన్నింటికి సంబంధించి కస్టడీలో అనేక కోణాల్లో కేజ్రీవాల్ ను ఈడీ విచారించబోతోంది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కలిపి కేజ్రీవాల్ ను విచారించే అవకాశం ఉంది.

కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పినప్పటికీ.. కేజ్రీవాల్ తరుపు న్యాయవాదుల వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారన్న ఈడీ తరుపు న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. కేజ్రీవాల్ ను 6 రోజుల ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చారు.

Also Read : ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ప్రభావం చూపనున్న 10 కీలక అంశాలు ఇవే..

 

 

ట్రెండింగ్ వార్తలు