Gautam Gambhir : ఢిల్లీలో 70శాతం మంది పిల్లలు నెబ్యులైజర్‌లను వాడుతున్నారు : గౌతమ్ గంభీర్

కేజ్రీవాల్ వైఖరి వల్లే ఢిల్లీలో పిల్లలు బాధపడుతున్నారని ఆరోపించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తాను బుధవారం ఒక వైద్యుడితో మాట్లాడానని చెప్పారు.

BJP MP Gautam Gambhir

BJP MP Gautam Gambhir : దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పెరుగుతున్న వాయు కాలుష్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఢిల్లీలో 70శాతం మంది పిల్లలు నెబ్యులైజర్‌లపై ఉన్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ఓటు రాజకీయం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ వైఖరి వల్లే ఢిల్లీలో పిల్లలు బాధపడుతున్నారని ఆరోపించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తాను బుధవారం ఒక వైద్యుడితో మాట్లాడానని చెప్పారు.

IIT BHU Student Molestation: వెలుగులోకి వచ్చిన దారుణం.. కాశీ ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

ఢిల్లీలో 70శాతం మంది పిల్లలు నెబ్యులైజర్‌లపై ఉన్నారని తెలిపారు. పిల్లలు చేసిన తప్పు ఏమిటని ప్రశ్నించారు. ఒక వ్యక్తి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి మోసం చేయాలనుకోవడం వల్లనే ఢిల్లీలో పిల్లలు కష్టాలు పడాల్సివస్తుందని గౌతమ్ గంభీర్ విమర్శించారు.