Kerala Road Accident
Kerala Road Accident : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వయనాడ్ లో జీపు లోయలో పడి ఎనిమిది మంది కూలీలు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు టీఎస్టేట్ లో పని చేస్తున్న కూలీలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో జీపు మొత్తం ధ్వంసం అయింది. లోయలో పడిన తాకిడికి జీపు రెండుగా చీలి పోయింది.
శుక్రవారం 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న జీపు వయనాడ్ సమీపంలోని మనంతవాడిలోని తవిన్ హాల్ గ్రామ పంచాయతీ సమీపంలోని లోయలో పడిపోయింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రెస్క్యూ టీమ్స్ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం వయనాడ్ ఆస్పత్రికి తరలించారు.
Haryana : నూహ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రోల్స్ రాయిస్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. ఇద్దరు మృతి
మృతులు టీ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న కూలీలుగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ ను ప్రమాదస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్సతోపాటు అన్ని సహాయక చర్యలు చేపట్టాలన్నారు.