BMC : 2050 కల్లా..ముంబైలో ఆ ప్రాంతాలు నీట మునిగిపోతాయి!

మహారాష్ట్ర సచివాలయ మంత్రాలయ, ముంబైలోని బిజినెస్ డిస్ట్రిక్స్ నారిమన్ పాయింట్ 2050 కల్లా నీట మునుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు.

Bmc

BMC Chief : ప్రకృతిని నాశనం చేయొద్దు. ప్రజలు మేల్కొనండి..భూతాపం పెరగకుండా ప్రజలు ప్రకృతిని కాపాడుకోవాలని, లేనిపక్షంలో భారీ నష్టం చవి చూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తుంటారనే సంగతి తెలిసిందే. అయినా..కాలుష్యం వెదజల్లుతూ..పచ్చటి చెట్లను కొట్టడం..ఇతరత్రా కారణాల వల్ల ప్రమాదం ఏర్పడుతోందని వెల్లడిస్తున్నారు. తాజాగా..బ్రుహన్ ముంబై నగర పాలక సంస్థ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ పలు వ్యాఖ్యలు చేశారు.

Read More : Covid Positive : ముంబైలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు..ఒకే స్కూల్ లోని 26మంది విద్యార్థులకు పాజిటివ్

మహారాష్ట్ర సచివాలయ మంత్రాలయ, ముంబైలోని బిజినెస్ డిస్ట్రిక్స్ నారిమన్ పాయింట్ 2050 కల్లా నీట మునుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. దీనికి కారణం కూడా చెప్పారు. భూతాపం పెరిగి..సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు మేల్కొనకపోతే..పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read More :  Mumbai : తడిసి ముద్దయిన ముంబాయి, నీట మునిగిన రోడ్లు

2021, ఆగస్టు 28వ తేదీ శనివారం ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్, వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రేతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…కమిషనర్ ఇక్బాల్ సంగ్ మాట్లాడుతూ…ప్రకృతి హెచ్చరికలు జారీ చేస్తుందని, ముంబై నగరంలోని సుమారు 70 శాతం..సౌత్ ముంబైలోని ఏ, బీ, సీ, డీ వార్డులు జలమయం అవుతాయని ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు. కుఫే పరేడ్, నారియన్ పాయింట్, మంత్రాలయ ప్రాంతాలు కనుమరుగు కావడం ఖాయమని స్పష్టం చేశారు.

Read More : ముంబాయిలో గర్భిణీలకు కరోనా..పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు

పర్వత శ్రేణులు కరగడం వల్ల భూతాపం కలుగుతుందని, మనపై నేరుగా ఉండదని అందరూ భావించారని, 129 ఏండ్లలో తొలిసారి గత సంవత్సరం వచ్చిన నిసర్గ తుఫాన్ ముంబైని ముంచెత్తిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత సంవత్సరం ఆగస్టు ఐదో తేదీన..నారియన్ పాయింట్ వద్ద ఐదు నుంచి 5.5 అడుగుల నీరు నిలిచిందని, దక్షిణాసియాలో క్లైమేట్ ఛేంజ్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన తొలి నగరం ముంబై అని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొనాలని, లేకపోతే భవిష్యత్ తరాలతో పాటు..ప్రస్తుత తరం ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని ఆయన మరోసారి హెచ్చరించారు.