Heavy Rains: 80 మంది మృతి, 4 వేల కోట్ల ఆస్తి ధ్వంసం.. హిమాచల్ ప్రదేశ్‭లో భారీ వర్షాల నష్టమిది

వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు మంగళవారం కులు సందర్శించారు. పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, అయితే ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందని ఆయన అన్నారు

Himachal Pradesh: ఉత్తర భారతదేశాన్ని కుదిపివేస్తున్న వర్షాలు హిమాచల్ ప్రదేశ్‭ రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. వర్షం కారణంగా వివిధ ఘటనల్లో రాష్ట్రవ్యాప్తంగా 80 మంది మృతి చెందారని, 3 వేల నుంచి 4 వేల కోట్ల రూపాయల వరకు ఆస్తినష్టం జరిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఇది జూలై 8వ తేదీ వరకు జరిగిన నష్టమేనని, ఈరోజుకు లెక్కిస్తే ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చని బుధవారం పేర్కొంది. దీనితో పాటు ఛండీగఢ్-మనాలి, షిమ్లా-కల్కా సహా రాష్ట్రవ్యాప్తంగా 1,300 వందల రోడ్లు పూర్తిగా బ్లాక్ అయ్యాయి.

Gorantla Butchaiah Chowdary : పవన్‎కు మద్దతుగా టీడీపీ నేత గోరంట్ల వ్యాఖ్యలు

మనాలి-మండి రూట్లో వన్ వే ట్రాఫిక్‭కు మంగళవారం రాత్రి అనుమతి ఇచ్చారు. దీంతో దారిలేక ఆగిపోయిన 1,000 కి పైగా టూరిస్ట్ వాహనాలు ముందుకు కదిలాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 40 బ్రిడ్జీలు ధ్వంసం అయ్యాయి. రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడంతో రాష్ట్రంలోని పాఠశాలలకు జూలై 15 వరకు సెలవులు ప్రకటించారు. ఇక ముంపు ప్రాంతాల్లో ఉన్న 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Komati Reddy Venkat Reddy: మంత్రి కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్.. అలాఅని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా ..

వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు మంగళవారం కులు సందర్శించారు. పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, అయితే ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందని ఆయన అన్నారు. నాల్గవ రోజు నిరంతర వర్షం ఉత్తర భారతదేశం అంతటా విస్తృతమైన వినాశనానికి కారణమైంది. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగింది. కొండచరియలు విరిగిపడటం, ఆస్తి ధ్వంసం వంటి కారణాలతో హిమాచల్ ప్రదేశ్ ఎక్కువగా దెబ్బతిన్నదని ముఖ్యమంత్రి అన్నారు.

Eatala Rajender: ప్రపంచంలో ఇలాంటి పదవి అంటూ ఒకటి ఉంటుందా.. ఈటలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టాస్క్ ఏంటి?

పశ్చిమ భంగం, రుతుపవనాల సంగమం కారణంగా అపూర్వమైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, భారత వాతావరణ విభాగం దేశంలోని 23 రాష్ట్రాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తరాఖండ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించగా.. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.