Komati Reddy Venkat Reddy: మంత్రి కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్.. అలాఅని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా ..
కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే లేని విషయాన్ని ఉన్నట్టుగా బీఆర్ఎస్ అపోహలు సృష్టిస్తుందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పది గంటల విద్యుత్ ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ నిరూపిస్తే సబ్ స్టేషన్‌లోనే రాజీనామా చేస్తానని అన్నారు.

Komati Reddy Venkat Reddy
Venkat Reddy: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ (Telangana) లో రైతులకు ఉచిత విద్యుత్ (Free electricity) విషయంపై చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ ముఖ్యనేతలు విద్యుత్ సౌధం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. పది గంటల విద్యుత్ ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ నిరూపిస్తే సబ్ స్టేషన్‌లోనే రాజీనామా చేస్తానని అన్నారు.
సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఎక్కడి సబ్ స్టేషన్‌కైనా వెళ్దాం అక్కడ లాక్ బుక్కుల్లో 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు చూపిస్తే జీవితాంతం బీఆర్ఎస్‌కి సేవ చేస్తా
అంటూ వెంకట్ రెడ్డి అన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నరంటే కేసీఆర్, కేటీఆర్ ప్లెక్సీకి పాలాభిషేకం చేస్తానని అన్నారు. మూడు గంటలు కావాలా.. మూడు పంటల కావాలన్న వ్యక్తిని చెప్పుతో కొట్టాలంటూ కోమటిరెడ్డి మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్యే వెయ్యి కోట్లు తిని తిన్నది అరకగ ధర్నాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా సవాలుకు ఎవడోస్తారో రండి.. కనీసం అరు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారో చూపించండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేశారు.
MLC Kavitha: కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వద్దు.. ఊరు పొలిమేర వరకు తరిమికొట్టాలి
కావాలని సత్యగ్రహ దీక్షని భగ్నం చేయడానికి బీఆర్ఎస్ నేతలు ఆడుతున్న కుట్ర అన్నారు. కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే లేని విషయాన్ని ఉన్నట్టుగా బీఆర్ఎస్ అపోహలు సృష్టిస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి హైదరాబాద్ వస్తారు. రేపు పిసిసితో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని వెంకట్ రెడ్డి చెప్పారు. చిన్న విషయాన్ని.. అననిది అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని వెంకట్ రెడ్డి విమర్శంచారు. తెలంగాణలో పది గంటలకు మించి కరెంటు రావడం లేదని, దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు నా సవాల్‌ను స్వీకరించాలని వెంకట్ రెడ్డి సవాల్ చేశారు.