లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చారని మందలించిన పోలీసులపై దాదాపు 93మంది కార్మికులు ఎదురుదాడి చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ సిటీలో జరిగింది. అంతేకాకుండా ఆదివారం రాత్రి గణేశ్ నగర్, తృప్తి నగర్ లో పరిస్థితి దారుణంగా తయారైంది.
దాదాపు 500మంది కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లాలని ట్రాన్స్‌పోర్టేషన్ సౌకర్యం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల నుంచి సూరత్ లోని పండేసరాలో టెక్స్‌టైల్ పరిశ్రమ కార్మికులు.
పోలీసులు వారి సైల్ లో ఇండోర్ లోనే ఉండాలని బయటకు రావొద్దని సూచనలు ఇస్తున్నారు. ఒక్కసారిగా రాళ్లదాడి చేయడం మొదలుపెట్టారు. సెక్యూరిటీకి రాళ్లు తగలడంతో పాటు పలు పోలీసు వాహనాలు రాళ్ల దాడికి గాయాలపాలైయ్యాయి. ఆ గుంపులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ తర్వాత కొందరు ఆందోళనకారులను ఆదివారం రాత్రి అరెస్టు చేసి, మిగిలిన వారిని సోమవారం అరెస్టు చేశారు.
‘500మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 93మందిని అరెస్టు చేశాం. పోలీసులపై దాడి, పబ్లిక్ ఆస్తుల ధ్వంసం కేసుల్లో వారిని అరెస్టు చేశాం. వాటితో పాటు ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ను ఉల్లంఘించిన కారణంగా, నియమాలను వ్యతిరేకించిన కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.