Special shoe for blind: అంధుల కోసం ప్రత్యేక బూట్లు తయారు చేసిన 9th క్లాస్ విద్యార్ధి

అస్పోంకు చెందిన 9th క్లాస్ విద్యార్ధి అంధుల కోసం ప్రత్యేక బూట్లు తయారు చేశాడు.

Special shoe for blind: ఆ పిల్లాడు చదివేది 9th క్లాస్. కానీ బుర్ర మాత్రం యమా షార్ప్. శాస్త్రవేత్తలకు ఏమాత్రం తీసిపోని విధంగా అంధుల కోసం ఓ సరికొత్త బూట్లు తయారు చేశాడు. ఆ విద్యార్థి పేరు అంకురిత్ కర్మాకర్. అస్సోంలోని కరీంగంజ్ కు చెందిన అంకురిత్ అంధుల కోసం ప్రత్యేక బూట్లు తయారు చేశాడు. అవి ధరించి నడిస్తే ఎవరన్నా అడ్డు వస్తే ఆ బూట్లు శబ్దాలు చేస్తాయి. ఎదురుగా ఏమైనా అడ్డు వస్తే వెంటనే అప్రమత్తం చేస్తాయి.

ఈ ప్రత్యేక బూట్లు ధరించిన అంధులు రోడ్డుపై ఎదురుగా ఏదైనా వాహనం కానీ, వ్యక్తులు కానీ వచ్చినప్పుడు బూటులో ఏర్పాటు చేసిన సెన్సార్‌ పెద్దగా శబ్దాలు చేస్తుంది. దీంతో సదరు వ్యక్తులు అప్రమత్తమై సురక్షితంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

అంకురిత్ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ‌… భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానని అంటున్నాడు. తగిన ప్రోత్సాహం అందిస్తే ఈ పరికరాన్ని తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకువస్తానని చెబుతున్నాడు. శాస్త్రవేత్త కావడం తన లక్ష్యమని తెలిపాడు. చూపుకోల్పోయిన వారి కోసం సరికొత్త పరికరాన్ని తయారు చేసిన అంకురిత్‌.. మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు