ఓ కేసులో రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఓ యువకుడికి మూడేళ్లు సోషల్ మీడియా బ్యాన్ విధించింది. ఏ రూపంలో కూడా అతడు సోషల్ మీడియా వాడకూడదని షరతులు విధించింది. అతని పేరు మీద కానీ, ఇతరుల పేర్ల మీద కానీ, ఫేక్ అకౌంట్ల ద్వారా కానీ సోషల్ మీడియా వాడకూడదని కండిషన్ పెట్టింది. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. బెయిల్ ఇచ్చింది. సెకండియర్ చదువుతున్న ఓ కాలేజీ స్టూడెంట్ కి సంబంధించి హైకోర్టు ఇలాంటి బెయిల్ కండిషన్లు విధించింది.
19 ఏళ్ల ఈ కుర్రాడు తన ఫొటోలను ఎడిట్ చేశాడని. వాటిని అసభ్యంగా చిత్రీకరించాడంటూ 23 ఏళ్ల ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. అతడు ఫేక్ అకౌంట్లు వాడి తన అసభ్యకర ఇమేజ్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని.. దాని వల్ల తన వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయని పేర్కొంది. అంతేకాకుండా తన ఇమేజ్ లను చూపించి తనను లైంగిక వేధింపులకు, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడినట్టు ఆరోపించింది.
నిందితుడి తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ మీద వాదనలు వినిపించారు. కేసు ఆల్రెడీ విచారణ పూర్తయింది కాబట్టి నిందితుడు ప్రస్తుతం జైల్లో ఉండాల్సిన అవసరం లేదు.. చదువుకుంటున్న కుర్రాడు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి.. బెయిల్ ఇవ్వాలంటే కనీసం మూడేళ్ల పాటు సోషల్ మీడియా బ్యాన్ పాటించాలని కండిషన్ పెట్టారు. ఒకవేళ షరతులు ఉల్లంఘిస్తే వెంటనే మళ్లీ అరెస్ట్ చేయొచ్చని వార్నింగ్ ఇచ్చారు.
Also, Read:
కొంపముంచిన ట్రంప్.. భారత్‌లో ఆగిపోయిన చాలా మంది వివాహాలు.. హెచ్-1బీ వీసా హోల్డర్లు ఏమన్నారంటే?