కొంపముంచిన ట్రంప్‌.. భారత్‌లో ఆగిపోయిన చాలా మంది వివాహాలు.. హెచ్-1బీ వీసా హోల్డర్లు ఏమన్నారంటే?

కుటుంబంలో జరిగిన వేడుకలకు కూడా హాజరుకాలేకపోయామని తెలిపారు. మానసిక ఒత్తిడికి గురయ్యామని అన్నారు.

కొంపముంచిన ట్రంప్‌.. భారత్‌లో ఆగిపోయిన చాలా మంది వివాహాలు.. హెచ్-1బీ వీసా హోల్డర్లు ఏమన్నారంటే?

Representative image

Updated On : September 22, 2025 / 8:31 AM IST

H 1B visa holders: హెచ్‌-1బీ వీసాల దరఖాస్తు ఫీజును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ రూ.88 లక్షలకు పెంచడంతో టెక్‌ కంపెనీలు సమావేశమై ఉద్యోగులకు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సెలవులపై ఇతర దేశాలకు వెళ్లిన హెచ్-1బీ వీసా హోల్డర్లు 24 గంటల్లో యూఎస్‌కు తిరిగి వచ్చేయాలని చెప్పాయి.

అలాగే, తమ కంపెనీల్లో పనిచేస్తూ హెచ్-1బీ వీసాలు ఉన్నవారు రెండువారాల పాటు అమెరికాను వదిలి వెళ్లవద్దని అన్నాయి. ఈ ప్రభావం భారతీయులపై తీవ్రంగా పడింది. అన్ని కార్యక్రమాలను వదులుకుని వెంటనే అమెరికాకు వెళ్లిపోయారు. చాలా మంది పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి, కొందరివి రద్దయ్యాయి. అటువంటి వారు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

అమెరికాలో పనిచేస్తున్న సారమచ్ మహిళ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. జాలి లేకుండా, సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారని, తన తల్లి కన్నీరు పెట్టుకుందని ఆమె అన్నారు. చాలా కాలం తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన కూతురును తల్లి కళ్లారా చూసుకునేలోపే తిరిగి యూఎస్‌కు పంపించాల్సి రావడం దురదృష్టకరమని చెప్పారు. కుటుంబంలో జరిగిన వేడుకలకు హాజరుకాలేకపోయామని తెలిపారు. మానసిక ఒత్తిడికి గురయ్యామని అన్నారు.

Also Read: Weather Updates: ఈ 11 జిల్లాలకు అలర్ట్.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలాంటే హెచ్-1బీ వీసాలు ఉన్నవారు రెండువారాల పాటు అమెరికాను వదిలి వెళ్లవద్దని టెక్‌ కంపెనీలు సూచనలు చేయడంతో చాలా మంది భారత్‌కు రాలేకపోయారు. (H 1B visa holders)

తాను వివాహం చేసుకోవడానికి లీవ్ పెట్టి భారత్‌ వెళ్లాల్సి ఉందని, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్‌కు రాలేదని తెలిపారు. పెళ్లిని వాయిదా వేసుకున్నామని అన్నారు. చాలా మంది ఇటువంటి నిర్ణయాలే తీసుకున్నామని అంటున్నారు.

కాగా, ట్రంప్‌ విధించిన ఫీజు కొత్త దరఖాస్తులకు మాత్రమేనని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లెవిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హెచ్​ 1బీ హోల్డర్లు సాధారణంగానే ప్రయాణాలు చేసుకోవచ్చని చెప్పడంతో కొందరికి ఉపశమనం కలిగింది. ఆమె ఈ ప్రకటన చేయకముందే చాలా మంది తమ ట్రిప్‌లను రద్దు చేసుకున్నారు.