Weather Updates: ఈ 11 జిల్లాలకు అలర్ట్.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

హయత్ నగర్‌లో 8.5 సెం.మీ వర్షం కురవగా, ఉప్పల్, మల్కాజ్ గిరిలో 6 సె.మీ. వాన పడింది.

Weather Updates: ఈ 11 జిల్లాలకు అలర్ట్.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

Telangana Rains

Updated On : September 22, 2025 / 7:40 AM IST

తెలంగాణలోని 11 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్‌ నగర్, నాగర్‌ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

Also Read: వారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికే నేను వచ్చాను.. నా చేతులను కట్టేశారు: కేఏ పాల్

ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. నిన్న కూడా జనగాం, యాదాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ శివారులోని హయత్ నగర్‌లో 8.5 సెం.మీ వర్షం కురవగా, ఉప్పల్, మల్కాజ్ గిరిలో 6 సె.మీ. వాన పడింది.

బతుకమ్మ వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అయితే, వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలకు అంతరాయం కలిగింది. రానున్న రోజుల్లోనూ వానలు కురుస్తాయని వాతావారణ కేంద్రం చెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.