వారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికే నేను వచ్చాను.. నా చేతులను కట్టేశారు: కేఏ పాల్

"ఒక్క జూబ్లీహిల్స్‌లోనే లక్ష మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు" అని తెలిపారు.

వారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికే నేను వచ్చాను.. నా చేతులను కట్టేశారు: కేఏ పాల్

KA Paul

Updated On : September 21, 2025 / 7:31 PM IST

KA Paul: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇటీవలే స్పష్టం చేశారు. ఇవాళ 10టీవీ వీకెండ్‌ పాడ్‌కాస్ట్‌లో కేఏ పాల్ మాట్లాడారు.

“రేవంత్‌ రెడ్డి మాటలు చెప్పడం తప్ప పనులు ఏమీ లేవు. రాష్ట్ర సర్వనాశనం అయిపోయింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. నిరుద్యోగులు పెరిగిపోయారు. మోదీ, కేసీఆర్, రేవంత్‌ రెడ్డి ఎవ్వరూ ఉద్యోగాలు ఇవ్వలేదు.

ఒక్క జూబ్లీహిల్స్‌లోనే లక్ష మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు” అని తెలిపారు.

Also Read: 3.69 కోట్లు ఇచ్చింది.. యువకుడితో అతడి భార్యను విడదీసింది.. అతడితో ఏడాది ఉండి.. ఇప్పుడు ఆ డబ్బంతా ఇచ్చేయాలంటూ..

యువతకు ఇప్పుడు ఉద్యోగాలు దొరకడం లేదంటూ తనకు ఎంతో బాధేస్తోందని కేఏ పాల్ చెప్పారు. తనకు కంపెనీలను ఎలా తీసుకురావాలో తెలుసని, ఉద్యోగాలు ఎలా ఇవ్వాలో తెలుసని అన్నారు. కానీ, తన చేతులను కట్టేశారని చెప్పారు.

గజదొంగలు, వారసత్వ రాజకీయ నాయకులు ఇలా చేస్తున్నారని అన్నారు. వారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికే తాను వచ్చానని తెలిపారు. తాను ఎన్నో కష్టాలు పడ్డానని, అయినప్పటికీ చాలా హ్యాపీగా ఉంటానని చెప్పారు.

ఫుల్ ఇంటర్వ్యూ..