Boy Died : గురువింద గింజలు తిన్న బాలుడు 24 గంటల్లో మృతి

ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురువింద గింజలు తిని బాలుడు మృతి చెందాడు. 24 గంటల్లోనే అతను మరణించాడు. అతడి ఏడేళ్ల సోదరుడిని గంగారం ఆస్పత్రి డాక్టర్లు వైద్యం చేసి రక్షించారు.

Boy Died : గురువింద గింజలు తిన్న బాలుడు 24 గంటల్లో మృతి

boy died

Updated On : December 4, 2022 / 12:27 PM IST

boy died : ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురువింద గింజలు తిని బాలుడు మృతి చెందాడు. 24 గంటల్లోనే అతను మరణించాడు. అతడి ఏడేళ్ల సోదరుడిని గంగారం ఆస్పత్రి డాక్టర్లు వైద్యం చేసి రక్షించారు. అయితే 24 గంటల తర్వాత బాలుడిని ఆస్పత్రికి తీసుకొచ్చారని అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని డాక్టర్లు తెలిపారు. మెదడు ఉబ్బిపోయిందని, చిరాకుగా ఉన్నాడని వెల్లడించారు.

గురువింద అనేది ఒక ఔషధ మొక్క. వీటి గింజలు చాలా విషపూరితమైనవి. వీటిలో రెసినల్ కన్నా 30 రెట్లు ఎక్కువ విషం ఉంటుంది. ఒక్క గురివింద గింజ తిన్నా చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందులో ఉండే అబ్రిన్ వ్యక్తి కణాల్లోకి వెళ్లి ప్రొటీన్ తయారీని అడ్డుకుంటుంది.

Boy Died Warangal : వరంగల్‌లో విషాదం.. గొంతులో చాక్లెట్‌ ఇరుక్కుని బాలుడు మృతి

ఈ ప్రొటీన్లు లేకుంటే కణాలు మరణిస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం శరీరానికి హాని కల్గిస్తుంది. దీంతో వ్యక్తి మరణిస్తాడు. ఈ గింజలను పొడి చేసి పీల్చుకున్నా ప్రమాదకరమే. 36 నుంచి 72 గంటల లోపు మృతి చెందే అవకాశముంది.