Inmate Escape : పోలీసులను బురిడీ కొట్టించి.. బేడీలతోనే పారిపోయిన ఖైదీ

కోర్టు వాయిదా ఉండటంతో ఆరుగురు పోలీసులు, ఐదుగురు ఖైదీలను జైలు వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. ఓ ఖైదీ పోలీసులని బురిడీ కొట్టించి పారిపోయాడు.

Inmate Escape

Inmate Escape : కోర్టు వాయిదా ఉండటంతో ఆరుగురు పోలీసులు, ఐదుగురు ఖైదీలను జైలు వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు విచారణ అనంతరం వారిని తిరిగి జైలుకు తరలిస్తుండగా ఓ ఖైదీ పోలీసులని బురిడీ కొట్టించి పారిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జూనియర్ డివిజన్ సివిల్ మున్సిఫ్ కోర్టు వద్ద జరిగింది. ఘటనకు సంబందించిన వివరాలను జలౌన్ జిల్లా ఎస్పీ రాకేష్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. కోర్టు విచారణ పూర్తైన తర్వాత ఐదుగురు ఖైదీలను జైలు వాహనంలో ఎక్కించారు..ఇదే సమయంలో ఖైదీ భూపేంద్ర యాదవ్ తనకు మూత్రం వస్తుందని చెప్పడంతో కిందకు దింపారు.

చదవండి : Delhi Police Arrest: ఎయిర్‌పోర్ట్‌ల్లో వందల మందిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

ఇదే సమయంలో పోలీసులకు ఝలక్ ఇచ్చి పారిపోయాడు భూపేంద్ర.. మూత్రం పోసేందుకు వెళ్లిన ఖైదీ ఎంతకు ఇంటికి రాకపోవడంతో చుట్టూ గాలించారు. కనిపించకపోవడంతో పారిపోయినట్లు నిర్దారింఛి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పారిపోయినట్లు గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. తప్పించుకున్న జైలు ఖైదీ భూపేంద్ర యాదవ్, జలౌన్‌లోని మొహల్లా రౌతాన్ కొత్వాలి నివాసి, దొంగతనం చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి :Delhi Police: ఢిల్లీ గల్లీల్లో పోలీస్, డ్రగ్ స్మగ్లర్స్ వార్, ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి