Delhi Police: ఢిల్లీ గల్లీల్లో పోలీస్, డ్రగ్ స్మగ్లర్స్ వార్, ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి

ఢిల్లీలో ఓ స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన నార్కోటిక్స్ పోలీసు బృందంపై.. ముఠా సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి.

Delhi Police: ఢిల్లీ గల్లీల్లో పోలీస్, డ్రగ్ స్మగ్లర్స్ వార్, ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి

Narco

Updated On : January 3, 2022 / 10:47 AM IST

Delhi Narcotic Police: దేశంలో మాదకద్రవ్యాల అక్రమరవాణా నానాటికి పెరిగిపోతుంది. డ్రగ్ స్మగ్లర్లను నియంత్రించడం పోలీసులు పెను సవాలుగా మారింది. ఢిల్లీలో ఓ స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన నార్కోటిక్స్ పోలీసు బృందంపై.. ముఠా సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న డ్రగ్ సరఫరా దారుడు..ధరంవీర్ అలియాస్ పల్లాను పట్టుకునేందుకు ఆదివారం పోలీసులు.. ఇంద్రపురిలోని అతని ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పల్లా ఇంటిలో లేకపోవడంతో బయటకు వచ్చారు. అదే సమయంలో పరిగెత్తుకు వచ్చిన 50 – 60 మంది ముఠా.. పోలీసులపై మూకుమ్మడి దాడికి పాలపడ్డారు.

Also read: Visakha RK Beach: ఆర్కే బీచ్ లో గల్లంతైన యుకులకోసం రెండో రోజు గాలింపు

పల్లానే ఇదంతా చేస్తున్నాడని గమనించిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెంటబడ్డారు. ఇంతలో కొందరు రౌడీ మూకలు.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు రౌడీ మూకలపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈఘటనలో ఇద్దరు యువకులకు తూటా గాయాలు కాగా, నలుగురు పోలీసులు గాయపడ్డారు. దాడి జరుగుతుండగానే పల్లా అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే గాయాలతో పట్టుబడ్డ ఇద్దరు యువకుల్లో అమిత్ అనే యువకుడు పల్లాకు దగ్గరి బంధువుగా పోలీసులు గుర్తించారు. అమిత్ పైనా ఆరు కేసులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. అతని ద్వారా పల్లాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.

Also read: Ragging Turmoil: సూర్యాపేటలో మెడికల్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం