Train Passanger
Railways : కదులుతున్న రైలులోంచి ఎక్కవద్దు, దిగవద్దు అని రైల్వే శాఖ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రయాణికులు ఎక్కతూనే ఉంటారు, దిగుతూనే ఉంటారు. గుజరాత్ లోని సూరత్ లో ఒక ప్రయాణికుడు అలా కదులుతున్న రైలులోంచి కిందకు దిగబోయి ప్రమాదంలో చిక్కుకున్నాడు. అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు.
సూరత్ రైల్వే స్టేషన్ లో రైలు ప్లాట్ ఫాం పై నుంచి కదిలింది. రైలులో ప్రయాణం చేస్తున్న ఒక యువకుడు ఉన్నట్టుండి రైలులోంచి కిందకు దిగబోయాడు. దీంతో అతను రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకు పోయాడు. ప్లాట్ ఫాంపై ఉన్న జనం ఒక్కసారిగా గట్టిగా అరిచే సరికి అలర్టైన గార్డ్, డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. వెంటనే రైలు ఆగిపోయింది. రైలునుంచి జారి పడిన ఆ వ్యక్తి తాపీగా లేచి ఇవతలకు వచ్చాడు.
Also Read : Boy Swallow Screws : తల్లిదండ్రులూ జాగ్రత్త.. ఏడాదిన్నర బాబు కడుపులో స్క్రూలు.. అసలేం జరిగిందంటే..
ఇంత జరిగినా అతనికి ఎటువంటి గాయాలు కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజిని రైల్వేశాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు రైలు గార్డును, డ్రైవర్ ను అభినందించారు.
— Ministry of Railways (@RailMinIndia) March 1, 2022