Boy Swallow Screws : తల్లిదండ్రులూ జాగ్రత్త.. ఏడాదిన్నర బాబు కడుపులో స్క్రూలు.. అసలేం జరిగిందంటే..

తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఏడాదిన్నర బాలుడు ఆడుకుంటూ ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో గమనించ లేదు.

Boy Swallow Screws : తల్లిదండ్రులూ జాగ్రత్త.. ఏడాదిన్నర బాబు కడుపులో స్క్రూలు.. అసలేం జరిగిందంటే..

Boy Swallows Screws

Boy Swallow Screws : తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఏడాదిన్నర బాలుడు ఆడుకుంటూ ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో గమనించ లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్ రే తీస్తే షాకింగ్ విజయం బటయపడింది. బాలుడు రెండు స్క్రూలు మింగినట్లు తేలింది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన రామ్మూర్తి, మాధవి దంపతులకు ఏడాదిన్నర వయసు బాబు ఉన్నాడు. ఆడుకుంటూ తన చేతికి దొరికిన ఇనుప స్క్రూలు మింగేశాడు. దీంతో అనారోగ్యానికి గురయ్యాడు. బాగా ఏడుస్తున్నాడు. బాబు అనారోగ్యానికి, ఏడ్వటానికి కారణం ఏంటో తల్లిదండ్రులకు తెలియలేదు. పొట్ట పట్టుకుని తీవ్రమైన బాధతో తల్లడిల్లుతున్న బాలుడిని చూసి తల్లడిల్లిపోయారు. బాబుకి ఏదో జరిగిందని వారికి అనుమానం వచ్చింది.

Mahabubabad : కొడుతున్నారంటూ టీచర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండో తరగతి చిన్నోడు

వెంటనే బాబుని తీసుకుని వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ల సూచన మేరకు బాబుకి ఎక్స్ రే తీయగా కడుపులో రెండు స్క్రూలు ఉన్నట్లు తేలింది. వెంటనే డాక్టర్లు మందులు ఇచ్చారు. వాటి ద్వారా బాబు ఒక స్క్రూని విసర్జించాడు. కడుపులో ఉండిపోయిన రెండో స్క్రూని బాబు విసర్జించేందుకు మందులు వాడుతున్నారు.

బాబు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా ఎప్పుడు ఏమవుతుందోనని చిన్నారి తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదని.. విసర్జన ద్వారా అది బయటకు వచ్చేస్తుందని డాక్టర్లు తెలిపారు. అలా జరగకపోతే ఎండోస్కోపి ద్వారా తీయాల్సి ఉంటుందని తెలిపారు.

ఏడాదిన్నర బాబు స్క్రూలు మింగిన ఘటన షాక్ కి గురిచేసింది. కాగా, ఈ ఘటన చిన్నపిల్లల తల్లిదండ్రులకు హెచ్చరికలాంటిది. చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించారు. అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. అనుక్షణం పిల్లలను కనిపెట్టుకుని ఉండాలన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం తింటున్నారు? అనేది నిత్యం గమనిస్తూ ఉండాలని సూచించారు. చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.