ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్ తోనే ఖాతాను తెరిచే విధంగా వెలుసుబాటు కల్పించింది.
ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్ తోనే ఖాతాను తెరిచే విధంగా వెలుసుబాటు కల్పించింది. ఆధార్ తో పని లేకుండా స్థానిక చిరునామా కింద నివాస రుజువుగా బ్యాంక్ శాఖలో స్వీయ ప్రకననను ఇస్తే సరిపోతుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఆధార్‌లో తమ స్వస్థలం చిరునామా ఉన్నప్పటికీ ప్రస్తుత చిరునామాతో బ్యాంకు ఖాతా ప్రారంభించాలనుకునేవారికి ఈ నిర్ణయం సహాయపడుతుంది.
చాలా మందికి ఆధార్‌లో ఒక చిరునామా ఉంటే ప్రస్తుతం ఉంటున్న చిరునామా మరొకటి ఉంటుంది. ఆధార్ కోసం తమ స్వస్థలం చిరునామా ఇచ్చి ఉపాధి కోసం పట్టణాలకు వచ్చి స్థిరపడేవారికి కేవైసీ సమయంలో ఇది సమస్యగా మారింది. అయితే ఇప్పుడు కేంద్రం ఆధార్ కు సంబంధించి కీలక సవరణ చేసింది. దీని ప్రకారం మీరు ఉంటున్న చిరునామా ఆధార్ కార్డులో ఉన్న చిరునామా వేర్వేరుగా ఉన్నప్పటికీ కేవైసీ కోసం ఆధార్ నంబర్ ఇవ్వవచ్చు.
ఆధార్ సంఖ్యనే ఐడీ ఫ్రూఫ్ గా ఉపయోగించి కేవైసీ కోసం మీరు ప్రస్తుతం నివాసముంటున్న ఇంచి చిరునామా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే ఇలా అడ్రస్ ఫ్రూఫ్ ఇచ్చే వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్రం నిర్ణయంతో ఇక మీదట ప్రస్తుత లేదా స్థానిక చిరునామా కోసం ఆధార్ లో ఉన్న శాశ్వత చిరునామాను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఆధార్ లో శాశ్వత చిరునామా ఉన్నప్పటికీ బ్యాంకు ఖాతాలో ప్రస్తుత చిరునామా ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.