Amit Shah On Pegasus Scandal : ఫోన్ హ్యాకింగ్ దుమారం.. అమిత్ షా సీరియస్

దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్​  వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.

Amit Shah On Pegasus Scandal  దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్​  వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు రాత్రి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని అవమానించడాని, భారతదేశం యొక్క అభివృద్ధి పథాన్ని అడ్డుకోవాలన్న ఒకే ఒక లక్ష్యంతో కొన్ని విభాగాల ద్వారా విస్తరించబడిన ఒక రిపోర్ట్ బయటికొచ్చిందని అమిత్ షా ఓ ప్రకటనలో తెలిపారు.

ఆప్ క్రోనాలజీ సమ్ జాయియే(మీ కాలక్రమం అర్థమైంది)అనే పదాన్ని తరుచూ చాలా మంది నాపై తేలికపాటిగా ప్రయెగిస్తుంటారు. కానీ  ఈ రోజు నేను సీరియస్ గా చెప్పాలనుకుంటున్నాను-ఎంపిక చేసిన లీకుల సమయం, అంతరాయాలు(పార్లమెంట్ ఉభయ సభల్లో) ఆప్ క్రోనాలజీ సమ్ జాయియే అని పరోక్షంగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలనుద్దేశించి అమిత్ షా తన ప్రకటనలో  విమర్శించారు.

READ Phone Tapping Row : ఫోన్ ట్యాపింగ్ వివాదం..లోక్ సభలో ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు

పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగించేందుకే ఈ రిపోర్ట్ ని తీసుకొచ్చారని షా తెలిపారు. ఆటంకాలు కలిగించేవాళ్లు,గ్లోబల్ ఆర్గనైజేషన్లు భారత్ పురోగతిని ఇష్టపడరని తెలిపారు. ఆటంకాలు కలిగించేవాళ్లు..భారత్ అభివృద్ధి చెందడం ఇష్టం లేని భారత్ లోని రాజకీయనేతలని అమిత్ షా పేర్కొన్నారు.

ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారన్నారు. రైతులు,యువకులు,మహిళలు,వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన కీలక బిల్లులు చర్చ కోసం వరుసలో ఉన్నాయని మరియు అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని చెప్పారని అమిత్ షా తెలిపారు. దీనికి అంతరాయం కలిగించేవారు మరియు అడ్డుకునేవాళ్లు తమ కుట్రల ద్వారా భారతదేశ అభివృద్ధి పథాన్ని పట్టాలు తప్పించలేరని అమిత్ షా ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సెషన్ పురోగతి యొక్క కొత్త ఫలాలను ఇస్తుందని అమిత్ షా తెలిపారు.

READCongress On Pegasus Spyware : అమిత్ షా రాజీనామా చేయాలి..మోదీపై విచారణ జరగాలి

ట్రెండింగ్ వార్తలు