AAP government (1)
AAP govt key decision : ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీయూసీ సర్టిఫికెట్ లేకుంటే బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయరని స్పష్టం చేసింది. ఈ నెల 25 నుంచి అమలులోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్ శనివారం(అక్టోబర్ 1,2022) తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 29న సమావేశమైన పర్యావరణ, రవాణా, ట్రాఫిక్ అధికారులు.. ప్రణాళిక, విధి విధానాలపై చర్చించేందుకు నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి కారణాలనీ, వాటిని తగ్గించేందుకు గాను అక్టోబర్ 25 నుంచి పీయూసీ సర్టిఫికెట్ లేకుండా బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు.
Congress President Poll: కాంగ్రెస్ అత్యున్నత పదవి రేసులో ఇద్దరూ దక్షణాది నేతలే
గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలును నిర్ధారించేందుకు ఈ నెల 3 నుంచి ఢిల్లీలో 24/7 వార్ రూమ్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు ఈ నెల 6 నుంచి యాంటీ డస్ట్ క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అక్కడ నిర్మాణ స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, కాలుష్యాన్ని అరికట్టనున్నట్లు వెల్లడించారు.