సీఏఏ అమలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

Arvind Kejriwal: అంతేగాక, దేశంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని అన్నారు. దోపిడీలు, అత్యాచారాలు..

దేశంలో సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్-సీఏఏ అమలును వ్యతిరేకిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ… పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్‌లో దాదాపు 2.5 నుంచి 3 కోట్ల మంది మైనారిటీలు ఉన్నారని చెప్పారు. అవి పేద దేశాలని.. దాదాపు 1.5 కోట్ల మంది భారతదేశానికి వస్తారని అన్నారు. వారిని ఎక్కడ ఉంచుతారని ప్రశ్నించారు. వారికి మనం ఎలా ఉద్యోగాలు ఇస్తామని నిలదీశారు.

మన ప్రజలకు రావాల్సిన ఉద్యోగాలు వారికి వెళతాయని కేజ్రీవాల్ చెప్పారు. అంతేగాక, దేశంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని అన్నారు. దోపిడీలు, అత్యాచారాలు, అల్లర్లు జరుగుతాయని తెలిపారు. కాగా, 2019 ఎన్నికల వేళ బీజేపీ తమ మ్యానిఫెస్టోలో సీఏఏను చేర్చింది. భారత్ పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ వెసులుబాటు ఇస్తుంది.

Also Read: మీరెవరూ రావొద్దు.. నేనొక్కడినే వెళతా.. అభిమానులకు ముద్రగడ లేఖ

 

ట్రెండింగ్ వార్తలు