సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు నాలుగు రోజుల ముందు ఆదివారం(ఏప్రిల్-7,2019) కాంగ్రెస్ అధికారికంగా తమ ఎన్నికల నినాదాన్ని విడుదల చేసింది.అబ్ హోగా న్యాయ్ (ఇప్పుడు న్యాయం జరుగుతుంది)అంటూ తమ కనీస ఆదాయ పథకం న్యాయ్ ను హైలైట్ చేస్తూ ఈ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది.ఐదేళ్లుగా బీజేపీ పాలనలో దేశప్రజలకు జరిగిన అన్యాయాలకు ఫుల్ స్టాప్ పెట్టి న్యాయం చేయాలన్నది తమ విధానమని, అచ్చే దిన్ తీసుకొస్తామన్న వాళ్లు అన్యాయమే చేశారని సీనియర్ కాంగ్రెస్ లీడర్,కాంగ్రెస్ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ ఆనంద్ శర్మతెలిపారు.రాజ్యాంగ నిర్మాణ విలువలపై దాడి జరుగుతోందని శర్మ అన్నారు.
తమ ప్రచారం కేవలం కనీస ఆదాయంపై ఉండదని, రైతులు, యువతకు, వ్యాపారవేత్తలకు న్యాయం జరగాలన్నదే తమ ప్రచార ఉద్దేశమని ఆనంద్ శర్మ తెలిపారు.న్యాయ్ కు దేశవ్యాప్తంగా మంచి స్పందన రావడంతో తమ ప్రచారానికి ఈ ట్యాగ్ లైన్ పెట్టినట్లు తెలిపారు. పర్సెప్ట్ అనే అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీ కాంగ్రెస్ తరఫున ప్రచార వీడియోలు రూపొందిస్తున్నది.కాంప్యెయిన్ కోసం థీమ్ సాంగ్ ని జావేద్ అక్తర్ రచించగా,క్యాంపెయిన్ వీడియో సాంగ్ ని నిఖ్కిల్ అద్వానీ డైరక్ట్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల నినాదం ఉన్న భారీ కంటైనర్ల ట్రక్కులు దేశవ్యాప్తంగా తిరగనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే…న్యాయ్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యంత నిరుపేదలైన 5కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.72 వేలు వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని ఇటీవల ఎన్నికల్ల హామీల్లో భాగంగా కాంగ్రెస్ అధక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ठान लिया है सारे हिंदुस्तान ने,
आयी है सुनहरी घड़ी “न्याय की।
हर धोखे, जुमले का होगा हिसाब,
घड़ियां खत्म हुई अब “अन्याय” की।।
कांग्रेस बनेगी हर जन की आवाज,
दूर करेगी पीड़ा हर “असहाय” की।।#AbHogaNYAY pic.twitter.com/xGXs8GV7Fp— Congress (@INCIndia) April 7, 2019